పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బసవపురాణము

66

ననుచు వెండియు మ్రొక్క నంగన వచ్చి - తనపతి ప్రాణేశుతనువున నున్న
పొక్కులు వొడఁగని పురపురఁబొక్కి - అక్కటా! యీ పొక్కు లణఁగునే యింకఁ
బెనిమిటి దన్నుఁ జంపినఁ జంపనిమ్ము - అనుచుఁ దూపొడువ కే నరిగితినపుడు
కాన, నా తప్పునఁ గాఁజేసి శివుని - మేనఁ బొక్కులు గడు [1]ఇక్కుటంబయ్యె
పోనవే మున్ను దూపొడిచినచోట - నీవలిపొక్కు [2]లింకెన్నియు నేల?
నా నిమిత్తమునఁ బినాకి కిట్లయ్యె - నీ నిరోధం బింక నేఁ జూడఁజాల
ననుచుఁ బరిచ్ఛేదియై భక్తురాలు - దన శిరంబున కల్గఁ దత్ప్రస్తవమునఁ
దెఱవ ముగ్ధత్వంబు దేట[3]తెల్లముగ - మెఱయింతుఁ బొమ్మని మెచ్చి [4]యక్షణమ
భవరోగవైద్యుఁడు వార్వతీకాంతుఁ - డవినాశుఁ డజుఁడు ప్రత్యక్షమై నిలిచి
ప్రమథులు రుద్రులు బ్రహ్మాచ్యు[5]తేంద్రు - లమరసంఘము యథాక్రమమునఁ గొలువఁ
గరు[6]ణానిరీక్షణస్ఫురితసుధాబ్ధి - నిరువుర నోలార్చి యీప్సితార్థములు
[7]వేడుఁ డిచ్చెద” నన వెలఁదియుఁ బతియుఁ - బోఁడిగా సర్వాంగములుఁ బొదమ్రొక్కి
'దేవ! దేవాధీశ దివ్యలింగాంగ! - నీవు ప్రత్యక్షమై నిలిచిన మీఁద
వెండియు మఱియొండు వేఁడెద మనుట - యొండేమి? యది[8]యు నిన్నొల్లమిగాదె!
కావున, మీ పాదకమలాంతరంగ - భావసంపూర్ణసంపద గృపసేయు'
మని విన్నవించుడు నతివకుఁ బతికి - ననుపమపరమవరానందమూర్తి
ముఖ్యాపవర్గసముదితోపభోగ - సౌఖ్యత్వ మపుడు ప్రసాదించె శివుఁడు.

బెజ్జమహాదేవి కథ


మఱియును [9]విను బెజ్జమహాదేవి యనఁగఁ - గఱకంఠ శ్రీపాదకమలాంతరంగ
“యెల్లనియోగంబు లెల్ల బాంధవులు - నెల్లవారలు గల్గ నిట్లు భర్గునకుఁ
దల్లి లేకుండుట దా విచిత్రంబు - దల్లి [10]లే కది యెట్లు దా నుదయించె?
దల్లి సచ్చెనొ కాక త్రైలోక్యపతికిఁ - జెల్లఁబో! యిట్లేమి సేయంగవచ్చుఁ?
దల్లి సచ్చినఁగాదె తాను [11]డస్సితిని - ఎల్లవారికి దుఃఖ మిట్టిదకాదె
తల్లి గల్గిననేల తపసి గానిచ్చుఁ - దల్లి గల్గిననేల తల జడల్గట్టు?
దల్లి యున్న విషంబుఁ ద్రావ నేలిచ్చుఁ? - దల్లి యుండినఁ దోళ్లు దాల్ప నేలిచ్చుఁ?

  1. నేని వట్రిల్లె
  2. లింకిన్నియు
  3. తెల్లమిగ
  4. తత్‌క్షణమ
  5. తాదు
  6. ణావలోకన
  7. వేఁడుఁడు నావుండు
  8. నిన్నునొల్లమి
  9. మును
  10. లేకెట్లోకో తా జనియించె
  11. డస్సెడిని