పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

29

దానును బసవనదండనాయకుఁడు - నా నియోగము గొల్వ నరుదెంచుచుండఁ
బుణ్యపణ్యాంగనల్ పురవీథులందుఁ - బుణ్యాత్ము బసవప్రభునిఁ జూచువేడ్కఁ
“జూడఁగ వచ్చెద సుదతిఁ నే” ననుచు - “వేడుక [1]చెఱుపక వేగ ర”మ్మనుచు
“గాలిదొసఁగుఁ గాక! క్రమ్మఱు” మనుచు - “నేలమ్మ! వచ్చిన నేమి నీ”కనుచు
“నేకతంబొకతెవ యేఁగుమీ” వనుచు - “నీ కాళ్ల నడచెదనే కాంత!" యనుచుఁ
“బతిగన్న సైఁచునే పడఁతి! ని”న్ననుచుఁ - “బతిగని యెట్లైనఁ [2]బదరని"మ్మనుచు
“బసవన్నఁ జూడకపడఁతి! పో”ననుచు - “ముసుఁగిడి వేగ రా మురియక” యనుచు
“దోఁకొని పోయిన దోసమే” యనుచు - “మూఁకలోనికిఁబోకు ముగ్ధవీ” వనుచు
“దిక్కులు చూడక చక్కర"మ్మనుచు - “నెక్కడి తరువమ్మ! యింతి! నీ”కనుచు
“మానిని! బసవన్న మహిమ యి”దనుచు - “మానుగా భక్తుల మఱిచూత”మనుచు
“నిట్టి సందడి [3]గలదే యెందు” ననుచుఁ - “దట్టాడకిటు వేగ తరుణి! ర”మ్మనుచుఁ
“గంటివే బసవయ్యఁ గమలాయతాక్షి!” - “గంటినే మోక్షంబుఁగంటిఁగా” కనుచుఁ
“జూచితే!పోదమాసుకుమారి!” యనుచుఁ-“జూచుచుండఁగఁబోవ సొగయునే” యనుచు
వచ్చువారును జూచువారును గట్ట - నిచ్చువారును జూచి యేఁగెడెవారుఁ
బొరిఁబొరిఁ దెచ్చి విభూతివీడ్యంబు - లరుదొంద బసవయ్య కర్పించువారు
నంగన ల్వివిధపుష్పాంజలు లిచ్చి - మంగళారతులెత్తి మహి మ్రొక్కువారు
“స్వస్తి దీర్ఘాయువు శంకర!” యనుచుఁ - బ్రస్తుతిదీవనల్ పచరించువారు
హృద్యంబుగా గీతగద్యపద్యములఁ - జోద్యతరంబుగా స్తుతియించువారు
వారివారిక కయివారముల్ సేయు వారును నలిరేఁగి తారాడువారుఁ
గలకలంబులకు డగ్గఱక హర్మ్యాగ్ర - తలములపై నుండి దర్శించువారు
నం దొకయెడ విముగ్దాంగన యచటి - సుందరులకు సన్న [4]సూపి యిట్లనియె
“పంబిన వివిధవాద్యంబులుఁ దమ్మ - టంబులు నిస్సహణంబులు సెలఁగ
నందంద “చాఁగు బళా”! యంచు నేఁగు - నందికోలలవారు ముందటిగములు
నెల్ల [5]వెల్లెల్లుల కెల్లయై పరగు - నల్లహయా[6]రూఢ మవ్వీరగణము
చక్కగా నీ వ్రేలిచక్కటినడుమఁ - బెక్కువిధంబులం దక్కజం బగుచు
వేడుకఁ గోలాట మాడెడువారుఁ - గూడలి త్రిపురాంతకుని [7]కొల్వువారు
గెడఁగూడి పసిఁడిగిర్గిటకేళికలను - గడు నొప్పు సొన్నలికపురంబువారుఁ

  1. జరుపక
  2. బఱప
  3. గల్గునే యెన్నఁడ
  4. చూపుచుననియె
  5. పెల్లెలుగల
  6. రూఢుండప్పరగణము
  7. గొల్చువారుఁ; జూచువారు