పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

బసవపురాణము

యందఱుఁగొల్వంగ "నట్లకా”కనుచుఁ - గందర్పహరుభక్తగణములనెల్లఁ
గొలిచి తత్కారుణ్యజలరాశిఁ దేలి - యలరుచుఁ జనుదేర నంత నిక్కడను

బసవేశ్వరుఁడు కళ్యాణకటకము చేరుట


“నదెవచ్చె నిదెవచ్చె” నని విని ముదిత - హృదయుఁడై బిజ్జలుఁ డెదురుకొ న్వేడ్క
నలవడఁ బదియురెండామడనేల - గలయఁగఁ గల్యాణకటక [1]మంతయును
శ్రీరమ్యముగ నలంకారింపఁ [2]బంచి - భూరమణుండు శృంగారంబు సేసి
మండలాధీశ సామంత ప్రధాన - దండాధినాథమాతంగతురంగ
పరివారసహి[3]తుఁడై పరమహర్షమున - నరుదెంచి పదహతి ధరణి గ్రక్కదల
వివిధవాద్యధ్వనుల్ దివి [4]దీటుకొనఁగ - నవనీతలేశుఁ డల్లంతటఁ గాంచె
బసవకుమారు సద్భక్తిశృంగారు - నసదృశాకారుఁ దత్త్వార్థవిచారు
నేకాం[5]గవీరు దేహేంద్రియదూరు - లోకనిస్తారు నలోకానుసారు
జంగమవ్యాపారు సజ్జనాధారు - లింగగంభీరు గతాంగవికారు
విమలశివాచారుఁ ద్రిమలధిక్కారు - నమితమహాచారు నచలితధీరు
విరహితసంసారు వీరావతారుఁ - బరిహృతాహంకారు భక్తివిహారు
శివభక్తిసారు విశిష్టప్రకారు - నవినాశసంస్కారు నతులితశూరు
విపులక్షమాగారు వినయప్రచారు - సుపథైకవిస్తారు శుద్ధశరీరుఁ
గుజనవిదారు సద్గుణమణిహారు - వృజినతరుకుఠారు విహితోపకారు
నతిదయాలంకారు నఘసముత్సారు - హితహృద్గతోంకారు నతసముద్దారు
శ్రుతిపరిచారు నిర్మోహాంధకారుఁ - గృతరిపుసంహారు ధృతనయాచారుఁ
[6]జారునిర్మలకీర్తి సత్యప్రపూర్తి - సారసద్గుణవర్తి శాశ్వతమూర్తిఁ
గని పాదచారియై చనుదెంచి చేరి - ఘనతరప్రియపూర్వకంబుగ నపుడు
సముచితసత్కారసంతుష్టుఁ జేసి - సమదాంధగంధగజంబు [7]లేళ్నూఱు
పండ్రెండువేలు శుంభత్తురంగములు - పండ్రెండులక్షలు బలవత్పదాతి
పాటి బండారులు పన్నిద్ద ఱందు - మేటితనంబు నర్మిలినిచ్చి తనదు
నఖిలరాజ్యమునకు నర్హుఁగాఁ జేసి - సుఖలీల బిజ్జలక్షోణీశ్వరుండు

  1. మెంతయును
  2. బంపి
  3. తమై
  4. దీటిమ్రోయు
  5. ఈ ద్విపదము కొన్ని ప్రతులలోనే కలదు
  6. లేణ్ణూరు