పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

89


వారివారిక లింగవంతులై చూచి
వారివారిక లింగవంతులై కూడి

-బసవపురాణము.

ఈ ద్విపదలు బసవేశ్వరుని యుద్బోధమువలన లింగధారణములేని పాశుపతాదులుకూడ లింగధారులయి వీరశైవమునఁ జేరఁజొచ్చిరని చెప్పుచున్నది.

వ్రతం పాశుపతం చైవ కాలాముఖకపాలికే,
లింగాంగ సంగహీనత్వాత్తచ్ఛిష్యో నరకం వ్రజేత్.

- వీరశైవాచారసంగ్రహము.



శ్లో. శైవాన్ పాశుపతాన్ వామాన్ కాలాముఖమహావ్రతాన్,
    అతిరిచ్యతి దేవేశి! ప్రాణలింగార్చనో బుధః.

- వీరాగమము.

పై శ్లోకములు పాశుపతులు, కాలాముఖులు, కాపాలికులు లింగధారులు గారనియు, అట్టివారికి శిష్యుఁడగువాఁడు నరకము నందుననియుఁ జెప్పుచున్నవి. ఇట్టి శ్లోకములు పెక్కులు గలవు.

తెలుఁగునాటి యారాధ్యులు వీరశైవులు గారు;

పూర్వకాలమున వీరు లింగధారులు గారు

ఈ విషయము తగవులకుఁ దానకమగునని నే నెఱుఁగుదును. అయినను నాకు వాస్తవముగాఁ దోఁచినదానిఁ దెలుపుచున్నాఁడను. ప్రాజ్ఞులు పరిశోధింపఁ దగుదురు. తెలుఁగుదేశపువారగు పండితత్రయము (శివలెంకమంచెన పండిత, శ్రీపతిపండిత, మల్లికార్జున పండితులు) లింగధారు లనుటకు బలవదాధారములు నాకుఁ గానరాలేదు. మల్లికార్జున పండితారాధ్యుల గ్రంథమున నెక్కడను లింగధారణప్రశంసయే లేదుగదా! ఆంధ్రదేశమున నాకాలమునఁ గాలాముఖులు గూడఁ బలువురుండిరి. నన్నిచోడని గురువయిన మల్లికార్జునుఁడు కాలాముఖమతమువాఁడు. ఆతఁడుగూడ లింగధారిగాఁడు. కుమారసంభవ మందెక్కడను లింగధారణప్రశంస గానరాదు. వీరశైవులు గర్హించు వర్ణాశ్రమాచారవిధులు, వైదికకర్మలు