పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

ప్రపంచ చరిత్ర


వరకు సంక్షేపముగా చూచితిమి. మన పర్యవేక్షణము మిక్కిలి సంక్షేపమైనది. ఒక విధముగా అభివృద్ధి చెందినట్టియు, లేదా ఏదో ఒకవిధమైన చరిత్ర గలిగినట్టియు దేశమును గురించియే మనము ముచ్చటించు చుంటిమి. ఈజిప్టులో పిరమిడ్లు, స్ఫిన్క్సు, ఇంకను ఇచ్చట వివరించుటకు వీలులేని యితర విషయములు ఏ గొప్ప నాగరీకము విజృంభించి నప్పుడు విలసిల్లి నవో దానిని స్పృశించితిమి. ఈ గొప్ప నాగరీకత ఉచ్చస్థితి ననుభవించి, మనము ముచ్చటించుకొనుచున్న కాలమునాటికే క్షీణించుటకు మొదలుపెట్టెను. క్నోస్సోసుకూడ అంతరించుటకు సిద్ధముగా నున్నది. చీనాలో విశాల కాలభాగములనుగూర్చి ముచ్చటించితిమి. ఆ కాలములో చీనా గొప్ప కేంద్ర సామ్రాజ్యముగా పెరిగి వృద్ధిజెందినది. వ్రాత, పట్టుతీయుట మున్నగు అనేక అందమగు విషయము లచ్చట తలయెత్తివృద్ధిజెందినవి. కొరియా జపానులను కొద్దిగా పరిశీలించితిమి. సింధులోయలో నున్న మొహెంజదారోలోని శిథిలములనుబట్టి తెలియవచ్చు ప్రాచీననాగరీకతను గూర్చియు, విదేశములతో వర్తకము సాగించిన ద్రావిడుల నాగరీకతనుగూర్చియు, ఆర్యులనుగూర్చియు కొద్దిగా తెలిసికొంటిమి. ఆరోజులలో ఆర్యులు రచించిన కొన్ని గ్రంథములను, వేదములను, ఉపనిషత్తులను, మహాకావ్యములైన రామాయణ మహాభారతములను గమనించితిమి. ఉత్తర హిందూస్థానము నాక్రమించి. పిమ్మట దక్షిణమునకు పోయి ప్రాచీనద్రావిడులతో కలిసి క్రొత్త నాగరీకమును, సంస్కృతిని నిర్మించిన ఆర్యుల నంటిపోతిమి. వారు నిర్మించిన నాగరిక సంస్కృతులలో కొంత ద్రావిడులపాలును, ఎక్కువగా ఆర్యుల పాలును ఉన్నట్లు తెలిసికొంటిమి. ప్రజాపరిపాలనా పద్ధతులమీద వారి గ్రామసంఘములెట్లు పట్టణములుగాను, నగరములుగాను పరిణమించినవో, వారి వనవాటికలందలి యాశ్రమములు విశ్వవిద్యాలయములుగా ఎట్లు పరిణమించినవో తెలిసికొంటిమి. మెసపొటేమియా, పరిషియా దేశములలో ఒక సామ్రాజ్య మంతరించినపిమ్మట వేరొక సామ్రాజ్య మెట్లు