పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

ప్రపంచ చరిత్ర


దొక విధమగు ప్రజాపరిపాలన ముంచెడిదని తేలుచున్నది. అనగా ఆర్యులగు ప్రజలు కొంతవరకు పరిపాలనమునం దధికారము వహించెడి వారన్నమాట.

ఈ హిండూ ఆర్యులను ఆర్యగ్రీకులతో పోల్చిచూడుము. భేదములు చాలా కనిపించునుకాని సాదృశ్యవిషయములుకూడ పెక్కు లున్నవి. రెండుచోట్లను ఒకవిధమగు ప్రజాపరిపాలన మమలులో నుండెను. ఆర్యు లున్నచోటనే సాధారణముగా ఇట్టి ప్రజాపరిపాలన ముండెనని మనము జ్ఞాపకముంచుకోవలెను. డారి బానిసలు - అనగా తక్కువవర్ణస్థులు ఇట్టి ప్రజాపరిపాలనమునుగాని, స్వేచ్ఛనుగాని ఎరుగరు. వర్ణములు నేడున్నట్లు, ఆ కాలమున అనేక విభాగములతో లేవు. ఆ రోజులలో హిందూ ఆర్యులందు నాలుగు సంఘభాగములు, అనగా నాలుగు వర్ణములు మాత్రమే ఉండెను. అవి యెవ్వియన - బ్రాహ్మణులు - వీరు పండితులు, పురోహితులు, ఋషులు : క్షత్రియులు -- పరిపాలకులు: వైశ్యులు వర్తకము చేయువారు: శూద్రులు ---పాటుపడి పనిచేయు కార్మికులు. కాన వర్ణవిభాగము వృత్తులనుబట్టి వచ్చెనని స్పష్టమగుచున్నది. తమచే జయింపబడిన జాతులతో తాము కలియ కుండ ఉండు తలంపుతో వర్ణవిభాగము ఆర్యులు చేసియుండవచ్చును కూడ. ఆర్యులు అభిమానపూరికులు. ఇతర జాతులను వారు తిరస్కారభావముతో చూచునంతటి దురహంకారపూరితులు. కాన తమజాతివా రితరజాతులతో కలియుట వారి కష్టము లేకుండును. సంస్కృతములో వర్ణ మను పదమునకు రంగు అని యర్థము. దీనినిబట్టి హిందూదేశమునకు వచ్చిన ఆర్యులు అచ్చటి యాదిమ నివాసులకంటె సుందరమైనవారు, శుభ్రవర్ణులు అని తేటపడుచున్నది.

ఆర్యులు కార్మికుల నణచిపెట్టి వారిని తమ ప్రజాపరిపాలనమునం దేవిధముగను కలుగజేసికొనకుండ చేసి రను విషయ మొక్కటియు, తమలో తాము స్వేచ్ఛ ననుభవించుచుండి రను విషయ మొక్కటియు