పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాచీన హిందూస్థానమున గ్రామ పంచాయతులు

61


దక్షిణమునకు పలువురు పోయియుండవలెను. దక్షిణమునకు పోయిన మొట్ట మొదటి ఆర్యుడు అగస్త్యముని యని పెద్దలు చెప్పుదురు. అతను దక్షిణాపథమునకు ఆర్యుల మతమును, సంస్కృతిని తీసికొనిపోయెను.

అప్పుడే ఇండియూ విదేశములతో వర్తకమును బాహాటముగా చేయుచుండెను. దక్షిణదేశమున దొరకు మిరియాలు, బంగారము ముత్యములు సముద్రమున కావలసున్న విదేశీయుల నాకర్షించెను. బియ్యమునుకూడ బహుశా ఆకాలమున ఎగుమతి చేసెడివారు, బాబిలన్‌లోని పురాతన భవనములంచు మలబారు టేకుకలప కానవచ్చినది.

క్రమక్రమముగా ఆర్యులు ఇండియాలో తమ గ్రామపద్దతిని ప్రారంభించి వృద్ధిలోనికి తెచ్చిరి. ఇది ప్రాచీన ద్రావిడ గ్రామము యొక్కయు, నవీన ఆర్యాభిప్రాయములయొక్కయు సమ్మేళనమే. ఈ గ్రామములు సర్వస్వతంత్రములనియే చెప్పవచ్చును. గ్రామస్థు లెస్నుకొన్న పంచాయతీ లీ గ్రామమును పరిపాలించుచుండెను. కొన్ని గ్రామములో. చిన్న పట్టణములోచేరి యొక రాజుయొక్కగాని, నాయకుని యొక్కగాని పరిపాలనమందుండెను. వీరి నొక్కొక్కప్పుడు ఎన్నుకొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు వీరు వంశ పారంపర్యముగా వచ్చిన వారై యుందురు. తరుచుగా వేర్వేరు గ్రామసంఘములుచేరి అందరి శ్రేయస్సునకును అవసరమైన పనులు చేయుచుండెడివి. రోడ్లు వేయుట, సత్రములు నిర్మించుట, పంటకాల్వలు త్రవ్వుట మున్నగు నిట్టి సంఘశ్రేయమున కుద్దేశింపబడిన కార్యములు చేయుచుండెడివి. రాజ్యమున తాను ప్రధానపురుషుడై నప్పటికి రాజు తన యిష్టమువచ్చినట్లు చేయుటకు వీలుండెడిది కాదట. , ఆర్యధర్మములకును, ఆచారములకును అతడు కట్టుబడియుండవలెను. అతనిని పదభ్రష్టుని చేయుటకుగాని, అతనిపై దండుగ (జుల్మానా) విధించుటకుగాని ప్రజలకు హక్కు కలదు. రాజ్యమును నేనే అని రాజు చెప్పుకొనుట లేదు. గత లేఖలలో ఈ విషయము నీకు వ్రాసితిని. వీనినిబట్టిచూడ ఆర్యుల నివాసభూములం