పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడమటి ఆసియాలోని సామ్రాజ్యములు

53


మగుటచే బహుశా వాణిజ్య మధికముగా జరుగుచుండెను. అతని కాలములోనే సైరస్‌పాలనమందున్న పర్షియన్ సామ్రాజ్యము అభివృద్ధిజెంది శక్తివంత మగుచుండినది. సైకస్‌కును, క్రోసస్‌కును యుద్ధము తటస్థించెను. అందు క్రోసస్‌ను సైరస్ ఓడించెను. ఈ పరాజయమును గూర్చియు, హీనస్థితికి వచ్చి గర్వియగు క్రోసస్ ఎట్లు బుద్ది తెచ్చు కొన్నదియు హిరొడేటస్ అను గ్రీకుచరిత్రకారుడు వ్రాసియున్నాడు.

సైరస్‌కు ఒక గొప్ప సామ్రాజ్య ముండెను. అది బహుశా తూర్పున ఇండియావరకుకూడ విస్తరించియుండెను. అతని తరువాత వచ్చిన డయరస్‌కు అంతకన్న గొప్ప సామ్రాజ్య ముండెను. ఈజిప్టు, మధ్యఆసియాలో చిన్నభాగము, సింధునదివద్దనున్న ఇండియాలోని చిన్న రాష్ట్రము సైతము అందుండెను. ఇండియాలోనుస్న ఈ రాష్ట్ర మునుండి పసిడిరజము రాసులుగా, కప్పముక్రింద, అతనికి చైల్లించుచుండిరట. ఆ రోజులలో బంగారుపొడి సింధునదీప్రాంతమున దొరుకుచుండవలెను. ఇప్పు డక్కడ ఏమియు దొరకదు. అది ఎక్కువ భాగము బీడుగానున్నది. శీతోష్ణస్థితి ఏవిధముగా మారినదో దీనినిబట్టి గ్రహించవచ్చును.

నీవు చరిత్ర చదివి వెనుకటి పరిస్థితులను నేటి పరిస్థితులతో పోల్చి చూచినప్పుడు ఒక్క విషయము నీమనస్సు నెక్కువగా ఆకర్షించును. ఆది మధ్యఆసియాలో వచ్చిన మార్పు. ఒకప్పు డా ప్రదేశమునుండి అసంఖ్యాకులగు మనుష్యజాతులును, గుంపులు గుంపులుగా స్త్రీపురుషులును బయలుదేరి దూరదేశములకు వ్యాపించిరి. ఒకప్పుడా ప్రదేశమునందు అద్భుతమగు గొప్పనగరములు ప్రాచీనకాలమున వెలసినవి- భాగ్యవంతమైనవి. జనసంకీర్ణమైనవి. నేటి యూరోపియన్ ముఖ్యనగరములకు సాటివచ్చునవి. నేటి బొంబాయి, కలకత్తా నగరములకన్న ఎంతో పెద్దవి. ఎక్కడ చూచినను ఉద్యానములే. ఎక్కడ చూచినను పచ్చికబయళ్లే. శీతోష్ణస్థితి సమశీతోష్ణముగా నుండెను. - అంత వేడియు లేదు. అంత చలియులేదు. ఇవి వెనుకటికాలము మాటలు. నేడో, చాలావందల