పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

ప్రపంచ చరిత్ర


మున బహుశా ఈజిప్టుయొక్క ఘనమగు ప్రాచీననాగరికత క్షీణించు చున్నట్లున్నది. అయినప్పటికిని ఆ కాలమున నది మిక్కిలి యభివృద్ధి జెందిన చేశ మనక తప్పదు.

ఆసియాలో ఏమి జరుగుచున్నదో ఇప్పుడు మనము చూతము. ఇచ్చట, నీ వెరుగుదువనుకొందునుగు, ప్రాచీన సాగరికతా కేంద్రములు మూడుండెను, మెసపొటేటయన్ కేంద్రము, ఇండియన్ కేంద్రము. చైనీసు కేంద్రము.

మెసపొటేమియా, పర్షియా, ఆసియామైనర్లలో, ఆ తొలిరోజులలోనే, సామ్రాజ్యమువెనుక సామ్రాజ్యమువచ్చి తరలిపోయెను. అస్సీరియన్ సామ్రాజ్యము, మీడియన్ సామ్రాజ్యము, బాబిలోనియన్ సామ్రాజ్యము, తరువాత పర్షియన్ సామ్రాజ్యము, ఈ సామ్రాజ్యములు ఒకటితో నొకటి ఎట్లు పోరాడుకొన్నవో, లేదా కొన్నాళ్ల పాటు ఎట్లు అన్యోన్యముగా ఉన్నవో, ఒండొరుల వినాశమునెట్లు చేసుకొన్నవో ఆ వివరములలోనికి మనము దిగ నవసరములేదు. గ్రీకు నగరరాజ్యములకును, పడమటి ఆసియా సామ్రాజ్యములకును ఉండు భేదము నీవు గమనించవలెను. మిక్కిలి ప్రాచీనకాలమునుండియు ఈ దేశములలో ఒక గొప్పరాజ్యమో, సామ్రాజ్యమో వెలయవలయునని ఆకాంక్ష ఉన్నట్లున్నది. అంతకు ముందున్న ప్రాతనాగరికత దానికి కారణము కావచ్చును. లేదా యితర కారణము లుండవచ్చును.

ఒక్క పేరును వినుటకు నీ విష్టపడవచ్చును. ఆ పేరు క్రోసస్. ఇతనిని గురించి నీ విదివరలో వినియుండవచ్చును. క్రోసస్ అంత ధనవంతుడగుట — ఇది ఇంగ్లీషులో ప్రసిద్ధలోకోక్తి, ఈతనిని గురించిన కథలుకూడ నీవు చదివియుండవచ్చును. అత డెంత ధనాఢ్యుడో ఎంతటి గర్వియో, ఎట్లు పరాభవింపబడెనో , లిడియా అను పేరుగల దేశమునకు క్రోసస్ రాజు. ఆసియాకు పడమటి తీరమున, నేడు ఆసియా మైనరున్నచోట ఈ లిడియా యుండెను. సముద్రము నంటియున్న దేశ