పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

ప్రపంచ చరిత్ర


సామ్రాజ్యములుపోవును. నిరుపమానశౌర్యోపేతులు, అభిమానపూరితులునగు రాజులు, చక్రవర్తులు కొంచెముకాలమే ప్రపంచ నాటకరంగమున సగర్వముగా సంచరింతురు. కాని నాగరికతలు నశించవు. అవి నిలిచి యుండును. ఇరాక్, పర్షియాలోమాత్రము ప్రాచీననాగరికత, ఈజిప్టు ప్రాచీననాగరికతవలెనే, పూర్తిగా అంతరించెను.

ప్రాచీనకాలమున గ్రీసు ఉన్నతస్థితియందుండెను. ఇప్పుడుకూడ దాని ప్రఖ్యాతినిగూర్చి ప్రజలాశ్చర్యముతో చదువుదురు. చలువరాతివిగ్రహముల సౌందర్యమును తిలకించునప్పుడు మనకో గౌరవాశ్చర్యములు పెనగొనును. మనవరకు వచ్చిన దాని ప్రాచీనసారస్వత ఖండములను పఠించునపుడు విస్మయమును, పూజ్యభావమునుకలుగును. నవీనయూరోపు కొన్ని విధములుగా చూచిన, ప్రాచీనగ్రీసుయొక్క బిడ్డయే యని చెప్పుదురు. ఆ మాట నిజమే. గ్రీకుల అభిప్రాయములును, ఆచారములును యూరోపుపై తమ ప్రభావమును అంతగా చూపినవి. కాని గ్రీసుప్రఖ్యాతి నే డెచ్చట నున్నది. ప్రాచీన నాగరీకము అంతరించి ఎంతకాలమో గడచినది. క్రొత్తపద్ధతులు ప్రవేశించినవి. నేడు గ్రీసు యూరోపుకు ఆగ్నేయముగానున్న ఒక చిన్న దేశముమాత్రమే.

ఈజిప్టు, క్నోస్సోస్, ఇరాక్, గ్రీసు - ఇవన్నియు మాయమైనవి. వాని ప్రాచీననాగరీకతలు, బాబిలన్, నినేవానగరములవలెనే అంతరించినవి. అయితే ఈ ప్రాచీననాగరీకముల కూటములోని మిగత యిద్దరు వృద్ధులమాట యేఘటి? చీనా, ఇండియాలమాట యేమిటి? ఇతర దేశము లందువలెనే సామ్రాజ్యము తరువాత సామ్రాజ్యము ఈ దేశములందును పుట్టినవి. దండయాత్రలు, విధ్వంసములు, దోపిళ్ళు బ్రహ్మాండముగా జరిగినవి. వందల సంవత్సరములు రాజవంశములేలినవి. వానికి బదులు క్రొత్తవంశములు వచ్చినవి. ఇతరదేశములందువలెనే ఇండియాలోను, చీనాలోనుకూడ ఇట్లు సంభవించినది. కాని ఇండియా చినాలలో తప్ప మరెచ్చటను నాగరీకము ఆజ్వధారవలె ఎడతెగక సాగలేదు. ఈ రెండు