పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

ప్రపంచ చరిత్ర


మనము గొప్పతనమునకుదారిచూపు ఈపరమధర్మమును విస్మరించితిమి. అందువల్లనే పతితుల మైతిమి. కాని మరల నేడు దానిఛాయలు పొడగట్టు చుస్నవి. దేశమునందు కదలిక పుట్టినది. పురుషులు, స్త్రీలు, బాలురు, జాలికలు చిరునవ్వుతో మాతృదేశవిముక్తికై కష్టములను, బాధలను గణించ కుండ ముందంజవేయుట చూచిన ఎంత యాశ్చర్యకముగా నుండును ! వారుమందహాసము చేయవలసినదే. సంతోషముగా నుండవలసినదే. మహదుద్యమమున పాల్గొను ఆనందము వారిదికాదా ! అదృష్టవంతులకు త్యాగానందముకూడ రాగలదు. నేడు మనము ఇండియా సంకెళ్లు సడలించుటకు ప్రయత్నించుచున్నాము. అది మహత్కార్యము. అంత కన్న మహత్కార్యము మానవకోటి శ్రేయస్సుకొరకు పనిచేయుట. బాధను, దుఃఖమును పారదోలుటకు మానవకోటి చేయుచున్న పోరాటములో మన పోరాట మొక భాగమని మనము భావించుచున్నాము కాబట్టి లోకకల్యాణమునకు చేతనైనంతవరకు మనమును సహాయము చేయుచున్నట్లు భావించుకొని సంతసింపవచ్చును.

అంతదనుక నీవు ఆసందభవనములో కూర్చుండుము. మీ అమ్మ మలక్కా చెరసాలలో కూర్చుండును. నేనీ నాయినీ చెరసాలలో కూర్చుందును. ఒకరినొకరము చూచుకోలేకపోతిమిగదాయని అనుకొనుచుందుము కదూ? మనము ముగ్గురము మరల కలిసికొనబోవు రోజును తలుచుకొనుము. ఆ రోజు ఎప్పుడు వచ్చునాయని నేను కనిపెట్టుకొని యుందును. ఆ యాలోచనలవల్ల నా గుండెలో బరువు తగ్గినట్లుండును. నాకుత్సాహము కలుగును.