పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

ప్రపంచ చరిత్ర

నేను చెప్పినట్లుగా నీ వదృష్టవంతురాలవు. మన దేశమున విజృంభించిన స్వాతంత్ర్యోద్యమము నీవు కన్నులార చూచుచున్నావు . మీఅమ్మ ఎంత దైర్యశాలిని : ఎంత ఉత్తమురాలు 1 ఇట్టి తల్లి నీకుండుట ఎంత అదృష్టము ! నీ కెన్నడైన సంశయము కలిగినను, చిక్కులు తటస్థించినను ఆమెకన్న నీకు ప్రియమగు సఖు లెవరు?

ఉందునా యింక, చిట్టితల్లీ : హిందూదేశమునకు సేవ చేయుటకై నీపు ధైర్యశాలినివగు యోధాగ్రణివగుదువుగాక. నీకు నా ప్రేమాశీస్సులు .


1

సంవత్సరాది బహుమానము

సంవత్సరాది, 1931

నీవు ముస్సోరీలోను, నేను అలహాబాదులోను ఉన్నప్పుడు, రెండు సంవత్సరములక్రితము, నేను నీకు వ్రాసిన జాబులు జ్ఞాపకమున్నవా? అవి బాగున్నవని నీవు నాతో చెప్పియుంటివి. అట్టి జాబులను మరల వ్రాసి ఈ మన ప్రపంచమునుగూర్చిన అధికవిషయములు నీకు చెప్ప కూడదా? యని యాలోచించుచుంటిని. కాని అట్లుచేయుటకు సంకోచించి తిని. ప్రపంచముయొక్క గతచరిత్రను, మహాపురుషులను, నారీమణులను, మహత్కార్యములను స్మరించుట సంతోషముతోకూడిన పనియే. చరిత్ర చదువుట మంచిదే. అంతకన్న మనోజ్ఞమైన, సంతోషకరమైన విషయము చరిత్రను నిర్మించుటకు తోడ్పడుట, ఈదేశములో నేడు చరిత్ర నిర్మింప బడుచున్నదన్న విషయము నీకు తెలిసినదేకదా ! ఇండియాపూర్వచరిత్ర పెద్దదేకాని అది అజ్ఞాతముగా నున్నది. అందు కొంత భాగము విచారకరమైనది, దుఃఖకరమైనది. తలచుకొన్నచో మనము తలలువాల్చి కంటతడి పెట్టుకో వలసివచ్చును. కాని మొత్తముమీద ఇండియా పూర్వచరిత్ర దివ్యమైనది. మనము గర్వింపదగినది. తలచుకొని సమ్మోదము నంద