పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరాది బహుమానము

21


దగినది. అయినను పూర్వచరిత్ర స్మరించుటకు నేడు మనకు తీరికలేదు. ఇండియాభావియే మన హృదయముల నాక్రమించుకొన్నది. ఈ భావికే మనమిప్పుడు రూపము నిచ్చుచున్నాము. మన కాలమును, శక్తిని దేని కొరకై వినియోగించుచున్నామో అట్టి వర్తమానముకూడ మనమనస్సుల నాక్రమించుకొన్నది.

ఇక్కడ నాయినీచెరసాలలో ఇష్టము వచ్చినట్లు చదువుటకుగాని, వ్రాయుటకుగాని నాకు తీరిక కలదు. కాని నామనస్సు కుదురుగా నుండుట లేదు. బయట జరుగుచున్న గొప్ప పోరాటమునుగూర్చి నే నూహించు కొనుచుందును. ఇతరు లేమి చేయుచున్నారో, వారితో నున్న నే నేమి చేసియుండెడివాడనో యని ఆలోచించుకొనుచుందును. వర్తమానమును, భావియు నన్ను పూర్తిగా ఆక్రమించుకొన్నవి. గతకాలమునాటి విషయములను తడవుటకు నాకు తీరిక యేదీ ? కాని నా యభిప్రాయము పొరపాటని నే ననుకొనుచున్నాను. బయట జరుగు కార్యములలో నేను కలుగజేసికొనలేనప్పుడు నే నేల విచారించవలెను ?

అయితే నేను వ్రాయకుండుటకు నిజమైన కారణము – రహస్యముగా నీ చెనిలో చెప్పుదునా? - వేరొకటి యున్నది. నీకు బోధించుటకు నా కెంతమాత్రము జ్ఞానమున్నదని నేను సందేహించుచున్నాను. నీవా ఆనాటికానాడు వడివడిగా పెరుగుచున్నావు. జ్ఞానార్జన చేయుచున్నావు. నేను పాఠశాలలోను, కాలేజీలోను, తరువాతను నేర్చుకొన్నదంతయు నీకు నేర్పుటకు చాలినంత లేదు, అథవా అది నీకు తెలిసిన విషయమై చప్పగా నుండవచ్చును. కొంతకాలమైన పిమ్మట నీవే నాకు తెలియని విషయము లెన్నోబోధించవచ్చును. నీజన్మదినమున నీకువ్రాసినజాబులో చెప్పినట్లు నేను మిక్కిలి తెలివిగల పురుషునివంటివాడను కాను. తెలివి యధికమై పగిలిపోదునేమో యన్న భయముతో నాతడు రాగిరేకులను తనచుట్టును బిగించుకొన్నాడట.

నీవుముస్సోరీలో నున్నప్పుడు ప్రపంచము యొక్క బాల్యమును