పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హెల్లాసు మహత్తర ప్రతిభ

99

గ్రీసుయొక్క ఆనాటిఉచ్చదశను జ్ఞాపకముచేయు కొద్దిపుస్తకములు, కొద్ది ప్రతిమలు, కొద్ది శిథిలములు మన కిప్పుడు గోచరమగుచున్నవి. ఈ కొద్దివస్థువులే మనచేత తలయూపించుచున్నవి. హెల్లాసు ప్రజల సర్వతోముఖచాతురి చూచి మనము ఆశ్చర్యమగ్నమానసులమగు చున్నాము. ఇంత అందమైన శిలాప్రతిమలను, భవనములను నిర్మించిన చేతుల కెంత పనితన మున్నదో! మనస్సు లెంత పరిపక్వమైనవో : ఆ రోజులలో విగ్రహాదుల చెక్కుటకు ప్రసిద్ధివహించిన శిల్పి ఫిడియాస్. ఇంకను ప్రసిద్ధు లనేకులుండిరి. వారి నాటకములు సుభాంతములును, దుఃఖాంతములును సర్వోత్తమము లనిపించుకొన్నవి. సోఫోక్లీసు, ఎస్కిలస్, యురిపిడిస్, అరిస్టోఫేన్సు, పింవార్, మినాండర్, సాఫో మున్నగు పేళ్లు ప్రస్తుతము నీకు నామమాత్రములే. కాని పెద్దదానివైన పిమ్మట వారి గ్రంథములను నీవు చదవగలవని ఆశింతును. చదివిగ్రీసుయొక్క మహత్తరప్రతిభ కొంత అవగతము చేసికొనగలవు.

ఏ దేశచరిత్రనైనను ఎట్లు చదువవలెనో ఈ కాలమందలి గ్రీసు చరిత్రనుబట్టిమనముగ్రహించవలెను. అల్ప సంగ్రామములమీదను, గ్రీకు రాష్ట్రములలో నున్న అల్పత్వముమీదను బుద్ధిపెట్టుకున్నచో వారిని గురించి మన మేమి తెలిసికొనగలము? వారిని మన మవగాహనచేసికో దలచుకొన్నచో వారి తలంపులను మనము గ్రహించవలెను. వారేమనుకొనుచుండిరి? వారెట్టి కార్యములు చేసిరి? అను విషయములను మనము తెలిసికొనప్రయత్నించవలెను. నిజముగాప్రధానమైనది అంతరచరిత్రమే. ప్రాచీన గ్రీకు సంస్కృతికి నేటి యూరోపును వారసుగా చేసిన దిదియే.

జాతుల జీవితములలో అట్టి తేజోవంతమగు దశలు వచ్చి, పోవుట చూడ వింతగా నుండును. కొంతకాల మాదశలు సమస్తమును వికాసవంతము చేయును. ఆదేశమం దాకాలమునందున్న స్త్రీ పురుషులు రమణీయమగు వస్తువులను సృష్టిచేయుదురు. ప్రజ లావేశపూరితులైరా యనిపించును. మన దేశమునందుకూడ అట్టిదశలు వచ్చినవి. మనకు