పుట:నాగార్జున కొండ.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక్ష్వాకు రాజులు

11


విశాఖుడికీ వివాహము చేసి ఇరుగుపొరుగువల్ల ప్రమాదం రాకుండా చేసుకున్నాడు. నాసిక ప్రాంతంలో విజృంభిస్తూండిన ఆధీడులబల్ల ఏప్రమాదం రాకుండా వారికి పొరుగున రాజ్యం చేస్తున్న శకక్షేత్రవుల ఆడపడుచు రుద్రధర భట్టారిక అనే ఆమెను ఈ మహారాజు తనకుమారుడు శ్రీవీరపురుషదత్తుడికి పెళ్ళి చేశాడు. ఈ విధంగా మహాప్రతిభాశాలి అయిన యీ మహారాజు దక్షిణాపధంలో ఏకై కసమ్రాట్టుగా వెలుగొందాడు.

శ్రీవీర పురుషదత్తుడు : ఇతడు తండ్రి అంత ప్రతిభాశాలి కాకపోయినా తనకి సంక్రమించిన విశాలమైన సామ్రాజ్యాన్ని నిల చెట్టుకోగలిగాడు. తన తండ్రి చూపిన రాజనీతినే అనుసరిస్తూ యీ మహారాజు తన కుమార్తె కోడబలిశ్రీని వనవాసీ మహా రాజయిన శివస్కందనాగశ్రీకి ఇచ్చి వివాహం చేశాడు ఆగవరాజ్యసంవత్సరంలో ఇతని మేనత్త చాంతిశ్రీ యొక్క, ఇతరరాజవంశ స్త్రీల యొక్క సహాయంతో నాగార్జునకొండలోయలో బుద్దుడి ధాతువు మీద నిర్మించబడిన మహాచైత్యం చక్కని శిల్ప ఫలకాలతో కొత్తదిగా చేయబడింది. ఈ మహారాజు తన పద హారవరాజ్య సంవత్సరంలో తాను అంతవరకూ అవలంబిస్తూ వచ్చిన వైదికమతాన్ని వదలి' బౌద్ధమతాన్ని అవలంబించాడు • ఈ ఘటన నాగార్జునకొండశిల్పములలో చక్కగా నిరూపించబడింది.

ఏహుపుల చాంతమూలుడు : ఇతడు పదకొండు సంవత్సర ములు రాజ్యంచేశాడు. ఇతని కాలంలో కూడా విజయపురిలోని బౌద్ధ