పుట:నాగార్జున కొండ.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

నాగార్జున కొండ

తలవరులుగా ఏలినకాలం కావచ్చును మొదటి చాంతమూలుడు క్రీ శ. 218_285 నడుమ, వీరపురుషదత్తుడు క్రీ శ. 235_255 నడుమ, రెండవ చాంతమూలుడు 255_266 నడుమ, రుళపురుష దత్తుడు 268_270 నడుమ పరిపాలించినట్లు నిర్ణయించవచ్చును.

మొదటి చాంత మూలమహారాజు : ఇతడు మహావైభవంతో పరిపాలన చేసిన ప్రతిభాశాలి. ఇతడు అశ్వ మేధాగ్నిష్టోమ వాజ పేయాగ్నిహోత్రము లనే యజ్ఞములను చేశాడు. అనేక కోటి గోదానములను' హిరణ్యహలశతసహస్రదానములను చేశాడు. " ఇతడు అప్రతిహత సంకల్పుడు. మహాసేనుడనే కుమారస్వామి భకుడు. అశ్వమేధయాగం చేయడం చాలా కష్టసాధ్యం అయిన పని. అనేకమంది రాజులు తన అధికారానికి తలలొగ్గిన పరాక్రమశాలిగాని ఈ యజ్ఞం చెయ్యలేదు. అలాగే వాజపేయ యాగం చేయడానికి ఎంతో అర్థబలం, అంగబలం కావాలి. ఈ యజ్ఞములు చేసి చాంతమూలుడు సమ్రాట్ సార్వభౌమ బిరుదులను వహించాడు. నాగార్జునకొండలో దొరికిన ఒక స్తంభంమీద ఈ మహా రాజు హిరణ్యదానంచెయ్యడం యజ్ఞములు చేసినతర్వాత ఊరేగడం శిల్పించబడినవి. ఇతని రాజ్యం పశ్చిమోత్తరంగా ఉజ్జయినీ పాలకులయిన శకక్షాత్రపుల రాజ్యం వరకూ, దక్షిణ పశ్చిమాన వనవాసీపాలకు లైన ఆంధ్రభృత్యుల రాజ్యంవరకూ వ్యాపించి ఉండేవి. చాంతమూలుడు మంచి రాజనీతి చతురుడు. ఇతడు తన సోదరి చాంతిశ్రీని పూగియులనే తెగకు చెందిన స్కందశ్రీ, తన కూతురు అడవిచాంతి శ్రీని ధనకులనే తెగకు చెందిన స్కంద .