పుట:నవ్వుల గని-మొదటి భాగము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6

నవ్వులగని


గును. తురకపకీరులు అడుగుకొనుటవలన సాధారణలాభమే కాని విశేష లాభము కలుగదు. వేశ్యలకు ముళములవలన వచ్చు ఆదాయము కన్న బాల్యులగు ధనికుల ప్రాపకమువలన కొంత జీవనోపాధి కలుగును. బృహస్పతి పగగృహవరియై యుండు సమయమున చంద్రుడు బృహస్పతి యింట్లో ప్రవేశించును. గావున యేమి ఫలము గలగునో చదువరులే యూహించగలరు. దీనికై యే విడ్డూరములు గలుగకుండా నవగ్రహదానములు చేయవలయునని మేము సలహాయిచ్చుచున్నాము. అమావాస్య దినంబున చంద్రగ్రహణంబును పౌర్ణ మిదినంబున సూర్య గ్రహణంబును కేవల సుదృశ్యములై సంభవించును [ఇది నమ్మని వారు మహాపాపమును జెందెదరు] . పంటలు మొత్తము పై బాగానేపండినను రహితులు పండలేదని గోలలెత్తుచునే యుందురు. సర్వేషాం సన్మంగళానిభవంతు.

పంచాంగ పీఠిక.

ఇష్టదేవతా ప్రార్ధనము.

సీ. వల్లికల్ తామరల్ బాపునమరవిల్లి
             యెలమ్మదేవత నెదఁ దలంచి
    రహి మాలపేరంటాండ్రను శివమాడించు
            జర్జంగి యసిరమ్మ సన్ను తించి
    కోళ్ళపొట్టేళ్ళ గైకొని మింగు కోరంగి
            తణుకులమ్మను మదాత్మను నుతించి
     రాజమహేంద్రవరంబు నందున్న
            చామాలమ్మ తల్లిని మదిభజింతు