పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17


రెండవది :- ---దొంగతనము, దోపిడీ, దుశ్చేష్ట, లేక అపరాధిక అక్రమ ప్రవేశము యొక్క నిర్వచనము క్రింద అపరాధమగుపట్టి ఏదేని కార్యమునకు గాని, దొంగతనము, దోపిడి, దుశ్చేష్ట, లేక అపరాధిక ఆక్రమ ప్రవేశము చేయు ప్రయత్నమగునట్టి ఏదేని కార్యమునకు గాని గురిచేయబడిన తనయొక్క లేక, ఎవరేని ఇతర వ్యక్తి యొక్క చరాస్తినైనను, స్థిరాస్తి నైనను, రక్షించుటకును, ప్రతి వ్యక్తికి హక్కు ఉండును.

మతిస్తిమితములేని వ్యక్తి మొదలైన వారి యొక్క కార్యము విషయములో స్వయం రక్షణ హక్కు.

98. ఒక కార్యమును చేయు వ్యక్తి బాలుడను, లేక పరిపక్వమైన బుద్ధిబలము లేనివాడను లేక మతిస్తి మితము లేనివాడను లేక మత్తుడై యున్నాడను కారణముగా గాని, ఆ వ్యక్తి. ఏదేని భ్రమకు గురియైనవాడను కారణముగా గాని, అన్యధా అపరాధమగునట్టి ఏదేని కార్యము ఆపరాధము కాకపోయినపుడు, ప్రతివ్యక్తియు అట్టి కార్యముపట్ల ఆ కార్యము అట్టి అపరాధపై యుండినచో తనకు ఎట్టి స్వయం రక్షణ హక్కు ఉండెడిదో అట్టి స్వయం రక్షణ హక్కునే కల్గి యుండును.

ఉదాహరణము

(ఎ) 'జడ్', పిచ్చిపట్టి నందువల్ల 'ఎ' ను చంపుటకు ప్రయత్నించును. 'జడ్' ఎట్టి అపరాధమును చేసినవాడు కాడు, కాని 'జడ్' ఉన్మాదుడు కానిచో 'ఏ'కు ఎట్టి స్వయంరక్షణ హక్కు ఉండెడిదో అట్టి స్వయం రక్షణ హక్కునే అతడు కలిగియుండును.

(బి) శాసనరీత్యా తనకు ప్రవేశించు హక్కు గల గృహములో 'ఏ' రాత్రివేళ ప్రవేశించును. 'జడ్' సద్భావముతో, 'ఏ' కన్నపుదొంగ ఆనుకొని అతనితో కలబడును. ఇటువంటి భ్రమతో 'ఏ'తో కలబడినందున ఇచట 'జడ్' ఎట్టి అపరాధము చేయలేదు. కానీ, 'జడ్' ఆ భ్రమతో వ్యవహరింపకుండినచో 'జడ్ ' పట్ల ఎట్టి స్వయం రక్షణ హక్కు 'ఏ' కు ఉండెడిదో అట్టి స్వయం రక్షణ హక్కునే 'ఏ' కలిగియుండును,

స్వయం రక్షణ హక్కు ఉండనట్టి కార్యములు.

99. సద్భావముతో వ్యవహరించుచు ఒక పబ్లికు సేవకుడు తన పదవీ ప్రాపకముతో చేసిన లేక చేయుటకు ప్రయత్నించిన కార్యము, ఖచ్చితముగా శాసనరీత్యా సమర్ధనీయమైనది కాకున్నను, ఆది మరణము లేక దారుణ ఘాత కలుగునను భీతిని సహేతుకముగా కలిగించనిదై నపుడు, ఆ కార్యము విషయములో ఎట్టి స్వయం రక్షణ హక్కు ఉండదు.

సద్భావముతో వ్యవహరించుచు ఒక పబ్లికు సేవకుడు తన పదవీ ప్రాపకముతో ఇచ్చిన ఆదేశమును బట్టి చేసిన లేక చేయుటకు ప్రయత్నించిన కార్యము, ఆ ఆదేశము ఖచ్చితముగా శాసనరీత్యా సమర్థనీయమైనది కాకున్నను, మరణము లేక దారుణ ఘాత కలుగునను భీతిని సహేతుకముగా కలిగించనిదై నప్పుడు, ఆ కార్యము విషయములో ఎట్టి స్వయం రక్షణ హక్కు ఉండదు.

పబ్లికు ప్రాధికారుల రక్షణ పొందుటకు సమయము ఉన్నట్టి సందర్భములలో ఎట్టి స్వయం రక్షణ హక్కు ఉండదు.

ఈ హక్కు యొక్క వినియోగింపు విస్తృతి,

ఏ సందర్భమునందును, రక్షణ నిమిత్తము ఆవశ్యకమైన దానికంటె అధికమగు కీడును కలిగించుటకు స్వయం ఈ రక్షణ హక్కు విస్తరించదు.

విశదీకరణము 1:--- ఒక కార్యమును చేయుచున్న వ్యక్తి పబ్లికు సేవకుడని తనకు తెలిసియున్ననే తప్ప, లేక అట్లు విశ్వసించుటకు తనకు కారణమున్ననే తప్ప, అట్టి పబ్లికు సేవకుడుగా ఆ పబ్లికు సేవకుడు చేసిన లేక చేయుటకు ప్రయత్నించిన కార్యము విషయములో, ఏ వ్యక్తియు తనకు గల స్వయం రక్షణ హక్కును కోల్పోడు.

విశదీకరణము 2 :-- ఒక కార్యమును చేయుచున్న వ్యక్తి పబ్లికు సేవకుని ఆదేశముననుసరించి వ్యవహరించు చున్నాడని తనకు తెలిసియున్ననే తప్ప, లేక ఆట్లు విశ్వసించుటకు తనకు కారణమున్ననేతప్ప, లేక అట్లు వ్యవహరించు వ్యక్తి తాను ఏ ప్రాధికారము క్రింద వ్యవహరించుచున్నాడో తెలిసిననే తప్ప, లేక అతడు వ్రాతమూలక ప్రాధికారమును కలిగియుండి చూపుమని ఆడిగినచో అట్టి ప్రాధికార పత్రమును చూపిననే తప్ప, ఆ పబ్లికు సేవకుని ఆదేశము నను సరించి చేసిన లేక చేయుటకు ప్రయత్నించిన కార్యము విషయములో ఏ వ్యక్తియు తనకు గల స్వయం రక్షణ హక్కును కోల్పోడు.

శరీర విషయమున స్వయం రక్షణ హక్కు మరణము కలిగించు మేరకు ఎప్పుడు విస్తరించును.

100. పై కడపటి పరిచ్ఛేదములో పేర్కొనిన నిర్భంధనలకు లోబడి, శరీర విషయమున స్వయం రక్షణ హక్కు, ఆ హక్కును వినియోగించుకొను సందర్భమును కలిగించిన అపరాధము ఇందు ఇటు పిమ్మట వివరింపబడిన వాటిలో ఏ రకపు ఆపరాధమైనను అయినచో, దౌర్జన్యపరునకు మరణమును, లేక ఏదేని ఇతర కీడును స్వచ్ఛందముగా కలిగించు మేరకు విస్తరించును, అవేవనగా:——