పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కష్టాల సింహావలోకనం 1


విరుచుకుపడితే అక్కడి కొద్దిమంది తెల్లవార్ల గతి ఏమి కాను? సముద్రంలో దూకడమే కదా వారికి గల మార్గం క యీ భయమే అక్కడి తెల్ల వాళ్లను పట్టుకుంది. అప్పుడు నేటాల్ యందుగల జనాభా వివరాలు క్రింది విధంగా వున్నాయి. హబ్షీల సంఖ్య 4 లక్షలు తెల్లవారి సంఖ్య 40 వేలు గిర్‌మిటియా కార్మికుల సంఖ్య 60 వేలు గిర్‌మిట్ ప్రధ నుంచి ముక్తి పొందిన వారి సంఖ్య 10 వేలు స్వతంత్ర భారతీయుల సంఖ్య 10 వేలు నిజానికి నేటాల్‌లో గల తెల్లదొరలు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కాని వాళ్లకు నచ్చ చెప్పడం సాధ్యం కాని పని భారత దేశపు దయనీయస్థితిని గురించి వాళ్ల ఆచార వ్యవహారాలను గురించి అక్కడి తెల్ల వాళ్లకు తెలియదు. తమ మాదిరిగానే భారతీయులు కూడా శౌర్యవంతులు సాహసవంతులు అయి వుంటారని వాళ్లభావం జనాభాను పరిగణనకు తీసుకోవడంలో వారి దోషం కూడా ఏమీ లేదు. భారతీయుల జనాభా ముందు తమ జనాభాను పోల్చి చూచుకొని వాళ్లు భయపడ్డారు. ఏదిఏమైనా అందుకు మంచి పరిణామమే కలిగింది. ఆ తరువాత నేటాల్ అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టారు. వాటిలో ఎక్కడా రంగు భేదాన్ని గురించి పేర్కొన లేదు యిది భారతీయులు సాధించిన ఘనవిజయ ఫలితమేనని చెప్పవచ్చు వాళ్లు ఆ బిల్లులో ఉపయోగించిన భాష విషయమై ఎంతో జాగ్రత్త వహించారు. దీనివల్ల భారతీయుల గౌరము పెరిగిందని చెప్పవచ్చు యీ సారి కూడా భారతీయులు వ్యతిరేకించారు. కాని రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించబడ్డాయి. అవి చట్టాలు అయ్యాయి. ఒక చట్టప్రకారం భారతీయ ప్యాపారస్తుల మీద ఆంక్షలు విధించబడ్డాయి. రెండో చట్టంద్వారా నేటాలులో భారతీయులు ప్రవేశించకుండా ఆంక్షలు విధించబడ్డాయి. మొదటిచట్టం ద్వారా నియమింప బడిన అధికారి యొక్క అనుమతిలేనిదే ఎవ్వరికీ వ్యాపారం చేసుకొనుటకు ఆర్డరు యివ్వడం జరగదు. ఆంగ్ల వ్యాపారస్తులు తిన్నగా ఆ అధికారి దగ్గరకు వెళ్ళి ఆర్డరు తెచ్చుకున్నారు. కాని భారతీయులు మాత్రం ఎన్నో అవరోధాల్ని ఎదుర్కోవలసి వచ్చింది. అతి కష్టం మీద వారికి