పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

కష్టాల సింహావలోకనం 1


3 పౌండ్లు, 16 ఏండ్ల కొడుకు వుంటే అతడు 3 పౌండ్ల తల పన్ను కట్టాలని కఠోర నిర్ణయం తెల్ల ప్రభుత్వం వారు గైకొన్నారు. ఇదిఎంత బరువైనదో భారతీయులు గ్రహించవచ్చు. ఒక కుటుంబం 12 పౌండ్లుపన్నుగా చెల్లించాలన్న మాట అనుభవించినవారికే ఆ బాధ తెలుస్తుంది వాళ్ల కష్టాలు ఎలాంటివో కండ్లారా చూచిన వారికి బోధపడుతుంది. నేటాలు ప్రభుత్వం వారి యీ నిర్ణయాన్ని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. కాని వినేనాధుడెవరు ? చివరికి 25 పౌండ్లు తగ్గి 3 పౌండ్లు అయ్యాయి. గిర్‌మిటియాలు ఏం చేయగలరు. అయితే భారతీయ వ్యాపారులు మాత్రం దేశభక్తితోను, పారిమార్ధిక భావంతోసు ఉద్యమం నడిపించారు. తెల్లవాళ్లు గిర్‌మిటియా కార్మికుల విషయంలో వ్యవహరించినట్లు గానే స్వతంత్ర భారతీయుల విషయంలో కూడా వ్యవహరించారు. నేటాలులో గల స్వతంత్ర భారతపౌరులకు వ్యతిరేకంగా పైన చెప్పిన ఉద్దేశ్యాలతోనే మరో ఉద్యమం ప్రారంభించారు భారతీయ వ్యాపారులు నేటాలులో బాగా పాతుకుపోయారు వాళ్లు నగరంలో ముఖ్యమైన చోట్ల భూములు కూడా కొన్నారు. గిర్‌మిటియా ప్రధనుంచి ముక్తి పొందిన స్వతంత్ర భారతీయుల సంఖ్య బాగా పెరిగిపోయింది. అవసరమైన వస్తువులకు గిరాకీ కూడా పెరిగింది వేలాది బస్తాల బియ్యం భారతదేశాన్నుంచి దిగుమతి కాసాగింది. వాటి అమ్మకం వల్ల భారతీయ వ్యాపారులకు మంచి లాభాలు రాసాగాయి హాబ్షీలతో జరిగే ప్యాపారంలో కూడా వారికి లాభాలు బాగా రాసాగాయి. దీన్ని చిన్న వ్యాపారస్తులైన తెల్లవాళ్లు సహించలేకపోయారు భారతీయ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి, చట్టరీత్యా మీకు కూడా నేటాలు అసెంబ్లీ సభ్యులుగా ఎన్నుకోబడుటకు అర్హులు అని ఇంగ్లీషు వాళ్లే చెప్పారు దానితో కొంతమంది భారతీయ వ్యాపారస్తులు తమ పేర్లు కూడా ఓటర్ల లిస్టులో చేర్పించుకున్నారు. ధీన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. యీ విధంగా భారతీయులస్థాయినేటాలులో పెరిగిపోతే వాళ్ల ముందు ఇంగ్లీషు వాళ్లు నిలవలేరనే నిర్ణయానికి వాళ్లు వచ్చారు. అందువల్ల అక్కడ ఏర్పడిన జవాబుదారీ ప్రభుత్వం భారతీయుడెవ్వడికీ ఓటింగు హక్కు లేకుండా చేయుటకు పూనుకున్నది. 1894లో యిటువంటి లక్ష్యంగల ఒక బిల్లు