పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

31


వాదనకు అనుకూలంగా కమిషన్ నిర్ణయం చేయలేకపోయింది. నిప్పు ఆరిపోయినా యింకా వేడి తగ్గనట్లు నేటాల్ ప్రభుత్వం మీద తెల్లవాళ్ల ఉద్యమ ప్రభావం బాగా పడిందని చెప్పవచ్చు. అక్కడి ప్రభుత్వం తెల్లవాళ్లది కనుకవాళ్లు తెల్లవాళ్లకు ప్రతికూలంగా ఎందుకు చర్య తీసుకుంటారు? అక్కడి తెల్ల ప్రభుత్వం వారు రెండు వర్గాల వాదల్ని భారతప్రభుత్వానికి పంపించారు. భారత ప్రభుత్వం మాత్రం భారతీయులుచిరకాలం గిర్‌మిటియాలుగానే వుండిపోవాలనే నిర్ణయం ఎలా చేస్తుంది. అసలు గిర్‌మిటియాలుగా పంపుతూ భారత ప్రభుత్వం చేసిన వాదన ఏమిటి? ప్రారంభంలో కొంత కాలంపాటు భారతీయులు గిర్మటియాలుగావుండి పనిచేస్తారని, ఆ తరువాత స్వతంత్రులై జీవన భృతికోసం వృత్తులు సొంతంగా ప్రారంభించుకుంటారని మొదటవారు అన్నారు. అప్పుడు నేటాలు క్రౌన్ కాలనీగా వున్నది. అందువల్ల కలోనియల్ ఆఫీసు అక్కడి పూర్తి బాధ్యత వహిస్తుందని భావిస్తూ వుండేవారు నేటాలు తెల్లవాళ్లకు ఆ ఆఫీసువల్ల తమ అన్యాయపు కోర్కెలు తీర్చుకోగలమని ఆశకలుగలేదు. అందువల్ల, అటువంటివే మరికొన్ని కారణాలవల్ల నేటాలులో జవాబుదారీ ప్రభుత్వం ఏర్పడాలని మరో ఉద్యమం ప్రారంభించారు. 1893లో అట్టి జవాబుదారీ ప్రభుత్వ నిర్మాణం అక్కడ జరిగింది. దానితో నేటాలు ప్రభుత్వం తమ శక్తిని గుర్తించింది. కలోనియల్ ఆఫీసు కూడా నేటాల్ తెల్లవాళ్ల కోరికల్ని తీర్చుటకు సిద్ధపడింది దానితో నేటాలు ప్రభుత్వం. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరపటం కోసం ప్రతినిధి బృందాన్ని భారతావనికి పంపించింది. గిర్‌మిట్‌ప్రధనుంచి ముక్తి పొంది నేటాలులో నివసించతలచిన ప్రతి భారతీయుడు 35 పౌండ్లు అనగా 375 రూపాయలు ప్రతి సంవత్సరం తల పన్ను చెల్లించాలని ప్రతినిధిబృందం భారతప్రభుత్వాన్ని కోరింది అంత భారీ పన్ను ఏ భారతీయుడూ చెల్లించగల స్థితిలో లేడు. అందువల్ల స్వతంత్ర పౌరులుగా నేటాల్‌లో వుండలేరు. ఆనాటి భారతవైస్రాయిగా వున్న లార్డ్ ఎల్గిస్‌కు 35 పౌండ్లు ఎక్కువ అని అనిపించింది. అందువల్ల 3కు తగ్గించాడు. ఈ పన్ను ఒక్క పురుషుడేగాక అతడి భార్యకు 3 పౌండ్లు. 13 ఏండ్ల వయస్సు గల కుమార్తె