పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

వాగ్దాన భంగం


విషయం కానీ ట్రాన్స్‌వాల్‌లో కొత్తగా ప్రవేశించిన భారతీయులపై కొత్తగా పెట్టిన ఆంక్షలను కూడా పోరాట ఉద్దేశ్యాలుగా చేర్చినప్పుడు ప్రభుత్వం సత్యాగ్రహంలో కొత్త విషయాలను కూడా చేర్చారని ఆక్షేపించింది. ఇది విజంగా అనుచితమే కొత్తగా వచ్చే భారతీయులపై యిది వరకు లేని ఆంక్షలను ప్రభుత్వం విధించినపుడు వాటిని పోరాట లక్ష్యాలలో చేర్చే అధికారం మాకున్నది. సోరాబ్జీ వంటి వారు ట్రాన్స్‌వాల్‌కి రావటం మనం చూశాం ప్రభుత్వం దీన్ని భరించలేకపోయింది. కానీ నిష్పక్షపాతులైన వారికి యీ చర్యలోని అనౌచిత్యాన్ని తెలియజెప్పటానికి నేను ఏ మాత్రమూ యిబ్బంది పడను.

గోఖలే వెళ్ళిపోయిన తరువాత ఇలాంటి అవకాశం మళ్ళీ వచ్చింది సంవత్సరం లోగా మూడు పౌండ్ల పన్ను రద్దు జరుగుతుందని వారి అభిప్రాయం. యూనియన్ పార్లమెంటులో వచ్చే సమావేశంలో యీ పన్నును రద్దు చేసే చట్టాన్ని ప్రవేశపెడతారని వారి నమ్మకం. కానీ దీనికి బదులుగా జనరల్ స్మట్స్ - నేటాల్‌లోని ఆంగ్లేయులు యీ పన్నును రద్దు చేయటానికి ఒప్పుకోవడం లేదన్న కారణంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం దీన్ని రద్దు చేయలేదని సమావేశంలో ప్రకటించారు. నిజానికి అలాంటిదేమీ లేదు. కేంద్ర పార్లమెంటులో నాలుగు అధినివేశరాజ్యాల ప్రతినిధులున్నారు. అందువల్ల నేటాల్ సభ్యుల సంగతి అక్కడ చెల్లుబాటు కాదు. అంతే కాక మంత్రివర్గం ప్రస్తావించిన బిల్లు పార్లమెంటు తిరస్కరించేవరకూ దాని ముందుకు తీసుకు వెళ్లవలసిన బాధ్యత జవరల్ స్మట్స్‌ది. కానీ అతను అలా చేయలేదు. అందువల్ల యీ క్రూరమైన చట్టాన్ని సైతం, యుద్ధ కారణాల్లో చేర్చటానికి అవకాశం సులభంగా దొరికింది. దీనికి రెండు కారణాలు మా వద్ద వున్నాయి. ఒకటి పోరాటం జరిగేటప్పుడు ప్రభుత్వం తాను యిచ్చిన వాగ్దానాన్ని తానే తప్పితే ఆ కారణాన్ని కూడా సత్యాగ్రహంతో కలుపవచ్చు. రెండు ఇలా మాట తప్పటం గోఖలే వంటి భారతదేశ ప్రతినిధిని అవమానపరచడమే. గోఖలేను అవమానపరిస్తే మొత్తం దేశాన్ని అవమానించినట్లే. ఈ అవమానాన్ని సహించటం అసాధ్యం. ఒకవేళ మొదటి కారణమొక్కటే వుండి వుంటే సత్యాగ్రహుల కింత