పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

307


శక్తి వుండేది కాదు. కేవలం మూడు పౌండ్ల పన్నును రద్దు చేయించటానికై సత్యాగ్రహం వంటి అస్త్రాన్ని వాడటానికి వారు ముందుకు వచ్చేవారు కారు కాని భారతదేశాన్నే అవమానించటమన్న మాట ఎవరికీ సహించరాని విషయమైంది. అందుకే , మూడు పౌండ్ల పన్నును రద్దు చేయించటమన్న ఉద్దేశ్యాన్ని కూడా పోరాటపు ఉద్దేశ్యాలలో కలపటం సత్యాగ్రహుల, దర్శమని నమ్మాము ఇప్పుడిక గిర్‌మిటియా భారతీయులకు కూడా సత్యాగ్రహులలో పాలు పంచుకునే అవకాశం లభించింది. గిర్‌మిటియా భారతీయులను పోరాటం నుంచి యిన్ని దినాలు దూరంగానే వుంచటం జరిగిందన్న సంగతిని పాఠకులు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఓ వైపు పోరాటంలో బాధ్యతా భారం పెరిగింది. మరోవైపు పోరాడే సైనికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కలిగింది

గిర్‌మిటియా భారతీయులతో యిప్పటి వరకు సత్యాగ్రహం గురించిన చర్చలే జరగలేదు. ఇక సత్యాగ్రహ శిక్షణ యివ్వటం ఎలా? వాళ్లు నిరక్షరాస్యులు కావటం వల్ల ఇండియన్ ఒపీనియన్ లేదా యితర వార్తాపత్రికలను చదువలేరు. అయినా వారు సత్యాగ్రహాన్ని గమనిస్తూనే వుండటం, జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవటం గమనిస్తూనే వున్నాను. పైగా సత్యాగ్రహంలో పాలుపంచుకోలేక పోతున్నామన్న బాధ వారిలో కొందరికి కలిగింది. కాని జాతీయ మంత్రి వర్గం తన వాగ్దానాన్ని భంగపరచిన తరువాత మూడు పౌండ్ల పన్నును యుద్ధకారణాలలో చేర్చినప్పుడు వారిలో ఎంతమంది పోరాటంలో చేరతారో నాకు తెలియదు.

ప్రభుత్వం మాట తప్పటాన్ని గురించి గోఖలే గారికి వ్రాశాను వారికి అమిత విచారం కలిగింది. నిర్భయంగా వుండి మేము ఆ మరణాంతమూ దీని కోసం పోరాడుతాము కానీ ఒక సంవత్సరంలోగా భారతదేశానికి నేను వచ్చే అవకాశం తప్పిపోయింది. మళ్ళీ ఎప్పుడు రాగలనో చెప్పటం అసంభవం అని వారికి వ్రాశాను. గోఖలేగారు. గణిత శాస్త్రజ్ఞుడు. సత్యాగ్రహంలో పాల్గొంటున్న సత్యాగ్రహల కనిష్ఠ గరిష్ఠ సంఖ్యను తెలియజేయమని వారు వ్రాశారు. నాకిప్పుడు జ్ఞాపకం వున్నంత వరకూ 65-86 నుండి 16 పేర్ల