పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

టాల్‌స్టాయ్ క్షేత్రం - 3


సత్యాగ్రహులు సదా ఉత్సాహాన్ని చూపేవారు. అందుకని కోర్టు అధికారులు సైతం వారి వద్ద జమానతు సేకరించటం అవసరమనుకునేవారు కాదు అందువల్లనే రైలు తప్పిపోతుందనే భయంతో యీ నవయువకులిద్దరూ బాధపడ్డారు. అందుకే వాయువేగంతో పరిగెత్తి రైలు స్టేషను చేరుకున్నారు సత్యాగ్రహ ప్రారంభ దినాల్లో జైలు అధికారులు వీరిని బాగా యిబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. కొన్ని చోట్ల జైలు అధికారులు వీరిలో చాలా కఠినంగా వ్యవహరించేవారు కూడా కానీ మా సమరం నడిచే కొద్దీ జైలు అధికారుల్లో మా పట్ల కాఠిన్యం తగ్గటం కొందరిలో స్నేహమాధుర్యం పెరగటం కూడా మేము గమనించాం అధికారులు సత్యాగ్రహులతో చాలాకాలంగా కలిసివున్నచోట స్టేషన్ మాస్టర్ లాగా స్నేహంగా మెలగటం వారికి సాయం చేయటం కూడా వుండేది. కానీ అధికారులకి లంచం యిచ్చి సత్యాగ్రహులు సౌకర్యాలు పొందేవారని పాఠకులు అనుకోవచ్చు. యిలాంటి అనుచిత సౌకర్యాలు కొనుక్కోవటం గురించి సత్యాగ్రహులెప్పుడూ ఆలోచించి యుండలేదు. మంచితనం వల్ల యివ్వబడే సౌకర్యాలను అనుభవించాలన్న తపన యెవరికి వుండదు? ఇలాంటి సౌకర్యాలను సత్యాగ్రహులు చాలా చోట్ల పొందేవాళ్ళు స్టేషన్ మాస్టర్ వీరికి ప్రతికూలంగా వుంటే నియమానుసారం వీరిని యిబ్బంది పెట్టగలడు ఈ యిబ్బందుల పట్ల ఫిర్యాదులు వుండవు ఒకవేళ స్టేషన్ మాస్టరు వీరికి అనుకూలంగా వుంటే నిమయానుసారం తాను నడుచుకుంటూనే వీరికి సౌకర్యాలు కల్పించగలడు. ఇలాంటి అన్ని సౌకర్యాలనూ ఆశ్రమానికి దగ్గరున్న లాల్‌^స్టేషనులో వున్న స్టేషన్ మాస్టర్ వల్ల మేము పొందగలిగాము దీనికంతటికీ కారణం సత్యాగ్రహుల శిష్టవ్యవహారం వారి ధైర్యం, దుఃఖాన్ని సహించే శక్తియే.

ఒక అప్రస్తుత ప్రసంగాన్ని కూడా వర్ణించటం అనుచితం కాదని నాభావన. 35 సంవత్సరాల వయసునుంచీ వారు ధార్మిక, ఆర్థిక ఆరోగ్య దృష్టితో ఆహార విషయంలో మార్పులు తీసుకురావాలనీ వాటిని ప్రయోగించి చూడాలనే కోరిక వుండేది. ఈ నాటికీ ఆ కోరిక ఏమాత్రమూ తగ్గలేదు. ఈ ప్రయోగాల ప్రభావం నా చుట్టుపట్ల వారిపై పడటం సహజం.