పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

287


వీటితోపాటు మందులకు బదులు ప్రకృతి వైద్యం అంటే నీరు మట్టివంటి వాటి ఉపచారంలో జబ్బులు తగ్గించటానికి నేను ప్రయత్నించేవాడిని. దక్షిణాఫ్రికాలో నేను వకాలతు చేసేటప్పుడు అక్కడి వకీళ్ళ కుటుంబాలతో నాకు స్నేహ సంబంధాలు వుండేవి. అందువల్ల వారి సుఖదు:ఖాలలో నన్ను భాగస్థుణ్ణి చేసేవారు. ఆరోగ్య విషయంలో నా ప్రయోగాలను గురించి తెలిసిన వారు అందులోనూ నా సాయం పొందేవారు. వారితో లుటావన్ అన్న వకీలు ఒకరు ఉత్తర భారత దేశం నుంచి గిర్‌మిటియా కూలీగా ఆయన దక్షిణాఫ్రికా వచ్చాడు. ఆయనకు 70 ఏళ్లు. చాలా సంవత్సరాలుగా ఉబ్బసం, దగ్గూ వుండేవి. ఆయనకు వైద్యుల మందులు డాక్టర్ల టాబ్లెట్ల ఆనుభవం చాలా వుంది. వారికి అప్పట్లో నా ప్రకృతి వైద్యంపై విశ్వాసం చాలా వుండేది. నా షరతులను పాటిస్తూ ఆశ్రమంలో వుంటే నేను నా ప్రయోగాలను వారిపై చేస్తానని అంగీకరించాను. ఆయన నా షరతులు ఒప్పుకున్నారు. వారికి పొగాకు అలవాటు బాగా వుండేది. నా అనేక షరతుల్లో పొగాకు వదిలి వేయాలన్న షరతు కూడా ఒకటి. రోజూ మధ్యాహ్నం 12 గంటలకు క్యూనే గారి కటిస్థానం చేయించటం మొదలెట్టాను. అది ఎండలో కూర్చునే వీలున్న ఋతువు భోజనంలో కొద్దిగా అన్నం నూనె, తేనె కొద్దిగా పాయసం తీయని నారింజ లేదా ద్రాక్ష, గోధుమ కాఫీ యివ్వటం జరిగేది ఉప్పు, మసాలాలు వుండేవి కావు. నేను పడుకునే చోటనే లోపలివైపు లుటావనీ పడక వుండేది. పడక కోసం ప్రతి ఒక్కరికీ రెండు కంబళ్ళు యిచ్చేవాళ్ళం. ఒకటి పరచుకోవటానికీ రెండోది కప్పుకోవటానికి చెక్కతో చేసినతలగడ వుండేది. ఒక వారం రోజులు గడిచాయి. లుటావన్ శరీరంలో వేడి పుట్టుకొచ్చింది. ఉబ్బసం తగ్గింది. దగ్గు తగ్గింది. కానీ ఉదయం బదులు రాత్రిపూట ఉబ్బసం దగ్గూ ఆయన్ని సతాయించటం మొదలెట్టాయి అతను దొంగతనంగా పొగాకు తీసుకుంటున్నట్టు నాకు అనుమానం కలిగింది. నేను అడిగితే ఆయన లేదని సమాధానం యిచ్చాడు. రెండు మూడు రోజులు గడిచాయి. తేడా కనిపించకపోయే సరికి నేను అతణ్ని చాటుగా పరీక్షించాలనుకున్నాను. అందరూ క్రింద పడుకునేవాళ్ళు. అందువల్ల పాముల భయం వుండనే వుంది. అందుకే కెలన్ బెక్ నాకు టార్చిలైటు