పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

231


అతిశయోక్తులు ప్రకటించినట్లు నాకు అనిపించలేదు సత్యనిష్ఠ, భగవంతునిపట్ల ప్రగాఢ విశ్వాసం, యివే భారతీయుల ఆయుధాలు ఈ ఆయుధాలు సర్వోన్నతమైనవి అయితే సామాన్య ప్రజానీకానికి యీ దృష్టి అలవడనంత వరకు, శ్వేత జాతీయుల ముందు నిరాయుధులైన భారత ప్రజలు హీనస్థితిలో వున్నారని చెప్పకతప్పదుకాని నిర్భలులకు రాముడే దిక్కు అని సూక్తి కదా!



28

భారతజాతిపై క్రొత్త ఆరోపణ

ట్రాన్స్‌వాల్ పార్లమెంటులో రెండవ ఆసియా చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందినప్పుడే జనరల్ స్మట్స్ మరో బిల్లును కూడా ప్రవేశపెట్టాడు దాని పేరు ఇమిగ్రేస్ట్స్ రెస్ట్రిక్షస్ ఆక్ట్ (1905-రెండవ ఆక్ట్) అంటే క్రొత్తగా వచ్చేవారి పై ఆంక్షలు విధించే చట్టం అన్నమాట క్రొత్తగా వచ్చే ప్రజలపై యీ చట్టం విధించబడుతుంది. ఇది ముఖ్యంగా హిందూదేశ ప్రజల నుద్దేశించి తయారు చేయబడింది. నేటాల్‌కి చెందిన యిలాంటి చట్టాన్ని అనుకరించే యీ చట్టం రూపొందించబడింది. ఏషియాటిక్ చట్టం అమలులోవున్న ప్రాంతాల నుంచి వలసవచ్చే ప్రజలందరినీ నిషేధించబడిన ఆగంతకులుగా పరిగణించే అవకాశం యీ చట్టంలో వుంది. ట్రాన్స్‌వాల్‌లో కొత్తగా ఏ భారతీయుడూ అడుగుపెట్టే అవకాశం యివ్వని యుక్తి యీ చట్టంలో వుంది. దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం భారతీయులకెంతైనా వుంది. కానీ యీ సత్యాగ్రహంలో యీ నూతన అంశాన్ని చేర్చాలా వద్దా అన్న ప్రశ్న యిప్పుడు ఎదురైంది. మాటిమాటికీ సత్యాగ్రహం చేస్తే అది దురాగ్రహ మనిపించుకుంటుంది. తమ శక్తిని గురించి సరైన అవగాహన లేకనే సత్యాగ్రహం, చేసి ఓడిపోయేవారు, తాము కళంకితులవటమే కాక, తమ అవివేకం వల్ల సత్యాగ్రహ శస్త్రాన్ని కూడా కళంకితం చేసిన వారవుతారు ఆ దగుల్బాజీ చట్టానికి విరుద్ధంగా మాత్రమే హిందూదేశ ప్రజలు జరుపుతున్న