పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

భారతజాతిపై క్రొత్త ఆరోపణ


పోరాటమే యీ సత్యాగ్రహమని సత్యాగ్రహ సమితికి స్పష్టంగా తెలుసు ఈ చట్టం రద్దయిపోతే వలస వచ్చేవారి పై ఆంక్షలు విధించే చట్టం లోని విషపూరితమైన అంశం కూడా దానంతటదే అంతమైపోతుంది ఖూనీ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నంచేస్తున్న నేపథ్యంలో యీ వలస వచ్చే వారిపై ఆంక్షలకు సంబంధించిన చట్టాన్ని ప్రత్యేకంగా వ్యతిరేకించవలసిన అవసరం లేదని భావించవచ్చు. దీని వల్ల కొత్తగా ఆంక్షలనన్నింటినీ అంగీకరించినట్లేననే అర్ధం వస్తుంది. అందుకని ఇమిగ్రేషన్ ఆక్ట్‌ని కూడా ఎదిరించటం చాలా అవసరం సత్యాగ్రహ అంశాలలో దాన్ని సైతం చేర్చాలా లేదా అని మాత్రమే యిప్పుడు ఆలోచించాలి సత్యాగ్రహ సమయంలో భారతీయులకు విరుద్ధంగా విధించబడే కొత్త ఆంక్షలను సైతం సత్యాగ్రహ ఆంశాలలో చేర్చటం ధర్మం దాన్ని చేర్చకపోతే అది వేరే విషయం కానీ జాతి యొక్క శక్తి క్షీణతను దృష్టిలో వుంచుకుని, లేదా సాకుగా తీసుకుని యీ విషపూరితమైన చట్టాన్ని వదిలివేయటం ప్రమాదకరం అందుకే యీ అంశాన్ని సైతం సత్యాగ్రహ కారణాల్లో చేర్చాలని నాయకులకు విదితమైంది.

అందుకై ట్రాన్స్‌వాల్ ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుప బడ్డాయి ఈ కారణంగా చట్టంలో మార్పు లేమీ కాకపోయినా భారత జాతిని ముఖ్యంగా నన్ను నిందించటానికి జనరల్ స్మట్స్‌కు మరో సాధనం లభించినట్లైంది బాహాటంగా ఎంతమంది ఆంగ్లేయపౌరులు భారతీయులకు తమ సహాయ సహకారానందిస్తున్నారో. అంతకు మించిన సంఖ్యలో అక్కడి ఆంగ్ల పౌరులకు భారతీయులపట్ల సానుభూతి ఉన్న విషయం స్మట్స్‌కి బాగా తెలుసు. అందుకని యీ సానుభూతని వీలైతే అంతమొందించాలన్న ఆలోచన ఆయనకు కలగడం సహజం అందుకని ఆయన నాపై మరో కొత్త ఆరోపణ చేయటం మొదలెట్టాడు. “గాంధీని నేనెరగినంతగా మీరెరుగరు ? ఒక అంగుళం స్థలాన్నిస్తే ఒక గజం స్థలాన్ని యివ్వమని గొడవచేసే వ్యక్తి యీ గాంధీ ఇందంతా నాకు తెలుసు అందుకే నేనీ ఆసియాచట్టాన్ని రద్దు చేయను సత్యాగ్రహం మొదలెట్టిన సమయంలో, కొత్తగా వచ్చే