పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

ఆంతరికమైన తీవ్రకలహాలు


అడవి అక్కడ వుంటున్న మేము మీకు భోజనం పెట్టలేక పోతే మీరు ఏం చేస్తారు అని అడిగాను “మీరు మమ్మల్ని భయపెట్టవద్దు. మా ఏర్పాట్లు మేము చేసుకోగలం మేము సిపాయిల్లా కాపలా కాచినంతకాలం మీ కొఠారాన్ని లూటీ చేసినా మమ్ము ఎవరు ఆపగలరు?" అని ఒక మిత్రుడు అన్నాడు.

ఇలా సరసాలాడుకుంటూ మేము ఫినిక్స్ చేరాం యీ రక్షక దళానికి నాయకుడు జెక్‌ముడలీ అతడు భారతీయుల్లో ప్రసిద్ధి కెక్కిన వ్యక్తి అతడు నేటాలు తమిళులైన తల్లితండ్రికి జన్మించిన వాడు. అతడు బాక్సింగులో ప్రత్యేక శిక్షణ పొందాడు. నల్లవాళ్లలోగాని, తెల్లవాళ్లలోగాని ఎవ్వడూ బాక్సింగ్‌లో అతణ్ణి గెలవలేరని అతడి. అతడి అనుచరుల నిశ్చితాభిప్రాయం

దక్షిణాఫ్రికాలో రాత్రిళ్లు వర్షాలు పడనప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి యింటి బయట ఆకాశం క్రిందపడుకొని నిద్రపోవడం నాకు అలవాటు యిప్పుడు అందు మార్పు చేయడం నాకు యిష్టం లేదు. అయితే స్వనిర్మిత రక్షక దళ సభ్యులు రాత్రిళ్లు నేను పడుకునే చోటును పహరా కాయాలని నిర్ణయించుకున్నారు. డర్చనులోనేను యీ రక్షకదళ సభ్యుల్ని ఎగతాళి చేశాను. నా వెంటరావద్దని ఆపుటకు కూడా ప్రయత్నించాను. కాని నాలో ఒక బలహీనత చోటు చేసుకున్నది. ఈ నిజాన్ని అంగీకరిస్తున్నాను వాళ్లు కాపలా కాస్తున్నప్పుడు నేను నిర్భయంగా వున్నాను అనే అనుభవం నాకు కలిగింది. వీళ్లు వచ్చి యుండకపోతే నేను యింత నిర్భయంగా నిద్రించి యుండలేక పోయేవాణ్ణి అని కూడా అనిపించింది. చీమచిటుక్కుమన్నా ఉలిక్కిపడేవాణ్ణి

ఈశ్వరుని మీద నాకు అమిత శ్రద్ధ వున్నదని నాకు గట్టినమ్మకం మృత్యువు మనిషి జీవితంలో వచ్చే గొప్ప మార్పు అని. ఎప్పుడు వచ్చినా అది స్వాగతానికి యోగ్యమైనదని ఎన్నో ఏండ్ల నుంచి నా బుద్ధి అంగీకరించిన విషయం అందుకని మృత్యువంటే కలిగే భయాన్ని తొలిగించుకొనుటకు ఎంతో ప్రయత్నించాను కాని నా జీవితంలో అనేక విషమ సమయాల్లో