పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

209


మృత్యువును ఆలింగనం చేసుకోబోతున్నానను భావం కలిగినప్పుడు సంతోషాన్ని పొందలేకపోయానని చెప్పక తప్పదు. దీర్ఘకాలాన్నుంచి విడిపోయిన మిత్రుని కలుసుకోనున్నామని తెలిసినప్పుడు కలిగేటంత సంతోషం, మృత్యు విషయంలో కలుగలేదు. ఎంత బలవంతుడు కావాలని మనిషి భావించినా మనిషి నిర్భలుడిగానే వుంటాడు. బుద్ధి వరకే నీమితమై యున్న అతనిజ్ఞానం అనుభవం దగ్గరికి వచ్చే సరికి జీవితానికి అది సరిగా ఉపయోగపడదు అప్పుడు బైటి సహాయం లభిస్తే స్వీకరిస్తాడు అంటే తన ఆంతర్గత బలాన్ని పోగొట్టుకుంటాడన్నమాట సత్యాగ్రహి ఆయినవాడు యిట్టి భయాలను తన మనస్సునుంచి తొలిగించుకోవాలి

ఫినిక్సులో వుంటూ నేను ఒక పని తీవ్రంగా చేశాను నా జాతి జనానికి ఏర్పడ్డ అపోహల్ని తొలగించుటకు ఇండియన్ ఒపీనియన్‌లో బాగా వ్రాశాను సంపాదకునికి, సందేహాలతో నిండిన పాఠక వర్గానికి మధ్య జరిగిన సంభాషణల రూపంలో కాల్పనిక సంభాషల్ని విపరీతంగా వ్రాశాను ఒడంబడికను గురించి నేను విన్న సందేహాల్ని, ఆపోహల్ని అనుమానాల్ని పోగొట్టుటకు నేను విన్నవాటినన్నింటినీ నేనే ప్రశ్నలుగా వ్రాసి వాటికి విస్తారంగా సమాధానాలిచ్చాను అందుకు మంచి ఫలితం కలిగిందని నమ్మకం నాకు కలిగింది. ట్రాన్స్‌వాల్ యందలి భారతీయులు దీర్ఘకాలం ఒడంబడిక తప్పని భావించలేదు నిజంగా వాళ్లకు సందేహాలు కలిగియుంటే భయంకరమైన పరిణామాలు సంభవించియుండేవి ఒడంబడికను అంగీకరించరు, అంగీకరించక పోవడం కేవలం ట్రాన్స్‌వాల్ యందలి భారతీయుల పని మాత్రమే వాళ్ల పనుల వల్ల, వారికీ, వారి సేవకుడుగానున్న నాకు పరీక్ష తప్పక జరిగియుండేది చివరికి స్వేచ్చగా అనుమతి పత్రాలు తీసుకొనని భారతీయులు బహుకొద్దిమంది మాత్రమే మిగిలారు. ఏషియాటిక్ ఆఫీసుకు పెద్ద సంఖ్యలో అనుమతి పత్రాలు తీసుకునేందుకు జనం బారులు తీరివుండేవారు పత్రాలు యిచ్చే అధికారులకు క్షణం తీరిక చిక్కేది కాదు. భారత జాతి త్వరగా ఒడంబడికకు సంబంధించిన షరతులను పాలించి చూపించింది. అలా పాలించడం