పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

207


ముగియబోతుండగా ఒక పరాను, పెద్దదుడ్డు కర్రపుచ్చుకొని వేదిక మీదకు వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడి లైట్లన్నీ ఆరిపోయాయి. నెను వెంటనే పరిస్థితిని గ్రహించాను సభాధ్యక్షత వహించిన సేర్ దావూద్ ముహమ్మద్ టేబుల్ పైకెక్కి జనానికి సర్ది చెప్పి శాంతింపచేయుటకు ప్రయత్నించసాగారు. నన్ను రక్షించదలచిన వాళ్లు నన్ను చుట్టి వేశారు. నా రక్షణ కోసం నేనేమీ ఏర్పాట్లు చేసుకోలేదు. అయితే అప్పుడు నేను అక్కడివారిలో చాలామంది నా మీద దాడిజరుగుతుందని ముందుగానే ఊహించి రక్షణ ఏర్పాట్లు చేశారని అర్థం చేసుకున్నాను. వారిలో ఒక మిత్రుడు జేబులో పిస్తోలు పెట్టుకొని వచ్చాడు. ఆయన గాలిలోకి ఒక గుండు పేల్చాడు కూడా యింతలో అక్కడి విషయమంతా గ్రహించిన పారసీరుస్తుమ్‌గారు కరెంటు స్పీడులో వెంటనే పోలీసు స్టేషను చేరుకొని పోలీసు సూపరింటెండెంట్ అలెగ్జాండరుకు సంగతంతా తెలియచేశాడు వెంటనే ఆయన పోలీసుల దళాన్ని అక్కడికి పంపించాడు. పోలీసులు సన్ను చుట్టివేసి తమ మధ్యన నిలిపి నన్ను పారసీ రుస్తుమ్ గారింటికి చేర్చారు

మరునాడు పారసీరుస్తుమ్ గారు డర్చనులో వున్న పరాన్లందరినీ పిలిపించి గాంధీ గారికి వ్యతిరేకమైన విషయాలన్నీ చెప్పమని కోరారు. నేను వాళ్లందరినీ కలిశాను వారికి నచ్చచెప్పి శాంతింపచేయుటకు ప్రయత్నించాను అయితే వాళ్లను శాంతపరచగలిగానని నాకు అనిపించలేదు. సందేహాలకు ఏమందూ పని చేయదు. కదా! ఎంత చెప్పినా ఏం లాభం? నేను భారత జాతిని మోసగించాననే భావం వారి మనస్సులో నాటుకుంది సందేహపు యీవిషం వారి మనస్సులనుంచి దిగిపోనంత వరకు నేను ఏమి చెప్పినా ప్రయోజనం లేదని తేలిపోయింది.

ఆనాడే నేను డర్బను నుంచి ఫినిక్సుకు బయలుదేరాను. రాత్రి నన్ను రక్షించిన మిత్రులంతా నన్ను ఒంటరిగా వదులుటకు సుతారాము యిష్టపడలేదు. మేము ఫినిక్సు వచ్చి మకాం పెడతామని గట్టిగా చెప్పారు నేను వద్దన్నప్పటికీ మీరు ఫినిక్స్ వస్తామంటే నేను ఆపగలనా? అక్కడ అంతా