పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

ఆంతరికమైన తీవ్రకలహాలు


జరుగుతూ వున్నాయి నేటాలులో కూడా భారతజాతికి అక్కడి ప్రభుత్వానికి జరిగిన ఒడంబడికను గురించి ఎన్నో ఆపోహలు ఉన్నాయని నాకు తెలిసింది నాకు, యితరులకు నేటాలునుంచి అందే ఉత్తరాల వల్ల యీ విషయం తెలుస్తూ వున్నది ఇండియన్ ఒపీనియన్‌లో ప్రకటించమని తీవ్ర పదజాలంతో నిండిన కటు వార్తలు, వ్యాసాలు కుప్పలు కుప్పలుగా పడి వున్నాయి యిప్పటి వరకు సత్యాగ్రహ పోరాటం ట్రాన్స్‌వాల్ యందలి భారతీయుల వరకే ఆగి యున్నది. అయినా నేటాలు యందలి భారతీయుల ఆంగీకారం పొందడం, వాళ్ల భావాల్ని పరిగణనలోకి తీసుకోవడం కూడా అవసరమే ట్రాన్స్‌వాల్ యందలి భారతీయులు ట్రాన్స్‌వాల్ పేరట దక్షిణాఫ్రికా యందలి సమస్త భారతీయుల కోసం పోరాటం సాగిస్తున్నారు. అందువల్ల నేటాల్‌లో అలుముకున్న అపోహల్ని తొలగించుటకు నేను డర్బన్ వెళ్లడం అవసరమని అనిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్నాను. అక్కడ వాతావరణం నాకు వ్యతిరేకంగా వున్నదని సభ జరిగితే నాపై దాడి చేయుటకు కొందరు సిద్ధపడుతున్నారని, అందువల్ల జాగ్రత్తగా వుండమని కొందరు స్త్రీలు నన్ను ముందుగానే హెచ్చరించారు. అయినా డర్బన్‌లో ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడి మిత్రులు రెండు మార్గాలు సూచించారు సమావేశంలో పాల్గొనకపోవడం లేక స్వరక్షణకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం అయితే రెండు ఉపాయాలూ నాకు నచ్చలేదు. యజమాని, సేవకుణ్ణి పిలిస్తే అతడు రాకపోతే సేవాధర్మాన్ని ఉల్లంఘించినట్లే కదా స్వామి సేవకు భయపడేవాడు. సేవకుడు ఎలా అవుతాడు? ప్రజలకు సేవ చేయడానికి సేవాభావంతో పూనుకోవడం నిజంగా కత్తి మీద సామువంటిదే ప్రశంసలు అందుకొనుటకు సిద్ధంగా వుండే ప్రజాసేవకుడు నిందలకు భయపడితే ఎలా అన్నీ ఆలోచించి సరిగ్గా సమయానికి నేను సభలో పాల్గొన్నాను ప్రభుత్వంతో జరిగిన ఒడంబడిక వివరాలన్నీ అక్కడి వారికి చెప్పాను వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు యిచ్చాను

ఆ సభ రాత్రి సుమారు 8 గంటలకు జరిగింది. సభాకార్యక్రమం