పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

205


ఆకర్షించి తీరుతుంది. యింతమంది ఆంగ్లేయుల, తదితర దేశీయుల అభిమానానికి పాత్రత పొందినది. భారతీయుల సత్యాగ్రహ శక్తియేయని మనవి చేస్తున్నాను

మూడో మహిళ కుమారి మోల్డినో ఆమె దక్షిణాఫ్రికాకు చెందిన మోల్డినో కుటుంబానికి చెందిన గౌరవనీయురాలు ఆమెకూడా శక్తిని బట్టి భారతీయులకు సహాయం చేసింది. ఈ తెల్లజాతి సహాయకులు చేసిన సహకారంపల్ల ఏం ఫలితం కలిగిందని పాఠకులు ప్రశ్నించవచ్చు. కొంతమంది అట్టి మిత్రులు చేసిన పనులే వారి సహకారానికి సాక్ష్యంగా వున్నాయి వీరందరి సత్కృషి వల్ల కలిగిన ఫలితం ఏమిటి అనేది ముఖ్య ప్రశ్న అసలు సత్యాగ్రహం సంగ్రామంలోనే దాని పరిణామ ఫలితం గూడా యిమిడి వుంటుంది. అసలు అది ఆత్మత్యాగం, ఆత్మ సహాయం మరియు, దైవశ్రద్దకు సంబంధించిన సంగ్రామం దాన్ని ఆ రూపంలోనే గుర్తించాలి

దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో అక్కడి తెల్లజాతి సహాయకులు అందించిన సహాయ సహకారాలకు ఎంతో ప్రాముఖ్యం వున్నది




24

ఆంతరికమైన తీవ్రకలహాలు

ఇరువది రెండవ ప్రకరణంలో ఆంతరికమైన కష్టాల్ని గురించి కొద్దిగా తెలుసుకున్నాం జోహన్స్‌బర్గ్‌లో పరాన్లు నాపై దాడి చేశారు. అప్పుడు నాకుటుంబం ఫినిక్స్‌లో వున్నది దాడి విషయం తెలియగానే నా భార్యపిల్లలు బాధపడటం సహజమే కదా! నన్ను చూచుటకు అంత డబ్బు ఖర్చుచేసి ఫినిక్స్ నుంచి జోహన్స్ బర్గ్ రావడం వారికి సాధ్యంకాని పని అందువల్ల ఆరోగ్యం కుదుటబడిన తరువాత నేనే అక్కడికి వెళ్లడం అవసరమని భావించాను

పనుల కోసం నేటాలు - ట్రాన్స్‌వాలుకు మధ్య నారాక పోకలు