పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

సహాయకులుగా వున్న తెల్లవారు

రెండవ మహిళ పేరు. కుమారి ఆలివ్ శ్రాయినర్. యీ మహిళను గురించి అయిదవ ప్రకరణంలో వ్రాశాను ఆమె దక్షిణాఫ్రికాకు చెందిన ప్రసిద్ధ శ్రాయినర్ కుటుంబంలో జన్మించిన విదుషీమణి శ్రాయినర్ కుటుంబానికి దక్షిణాఫ్రికా యందంతట ఎంతో గౌరవ ప్రతిష్ఠలు లభించాయి కుమారి శ్రాయినర్ పెండ్లి జరిగిన తరువాత ఆమెను పెండ్లాడిన భర్త ఆమె పేరును అంగీకరిరంచ వలసి వచ్చింది. అందుకు కారణం ఆమె మిధ్యాభిమానం కాదు. ఆమె కుటుంబగౌరవమే ఆమె ఎంత గొప్ప విదుషీమణియో అంతనిరాడంబరురాలు వినతగల మహిళ వారితో నాకు మంచి పరిచయం వున్నదని భావిస్తున్నాను వారి దగ్గర పని చేసే హబ్షీ నౌకర్లకు తమకు తేడా వున్నదని వారు ఎన్నడూ భావించలేదు. ఆమె రచించిన డ్రీమ్సు ఆను ఆంగ్ల పుస్తకం అందరూ చదువుతూ వుంటారు అది వచనంలో వ్రాయబడినా కావ్వ గౌరవం ఆ పుస్తకానికి అంతా యిస్తారు యింకా పలు గ్రంధాలు అమె రచించారు. ఆమెకు యింత గౌరవం వున్నా తనయింటి పనులు ఆమెయే చేసుకొనేది వంటపని తానే చేసుకునేది యింట్లో పాత్రలు కూడా తానే శుభ్రం చేసుకొనేది. శారీరిక కష్టంవల్ల మానసిక శక్తి పెరుగుతుందని ఆమె అభిప్రాయం దక్షిణాఫ్రికాలో భారతీయుల సత్యాగ్రహ సంగ్రామానికి అనేక విధాల సహాయం అందజేసింది. తెల్ల వారందరి పేర్లు యిక్కడ పేర్కొన లేదు. అయితే పేర్కొన్న వారందరి ద్వారా పేర్కొనని వారందరికీ కృతజ్ఞత తెలిపినట్లే మా కృతజ్ఞతా భావం భారతీయులందరి హృదయాలనుండి వెలువడినట్టిదే సత్యాగ్రహిగా పరిశుద్ధమైన మనస్సుతో చేసిన సంగ్రామానికి పరిశుద్దమైన ఫలితమే కలుగుతుందని నా అభిమతం అది కనబడవచ్చు కనబడకపోవచ్చు. కాని శుభపరిణామం తప్పదు. సత్యాగ్రహ సమరం అనేక పరిశుద్ధ హృదయాలను ఆకర్షించకుండా వుండదు. వాళ్లందరి శుభాకాంక్షల్ని. సహాయసంపదను అందుకుంటుంది అందుకు వేరే కారణాలు ఏమీ వుండవు. సత్యాగ్రహమందలి పరిశుద్ధ., నైతిక శక్తి, సత్యనిష్ఠ, త్యాగనిరతి, సహన శక్తి సహృదయులనందరినీ