పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

203


హాల్లో మేయరు అధ్యక్షతన తెల్లవారు ఒక సభ జరిపారు. భారతీయుల సత్యాగ్రహ సంగ్రామాన్ని నిందించడం, రక్తపు చట్టాన్ని సమర్థించడం ఆ సభ లక్ష్యం శ్రీ బేర్‌స్టెంట్ ఒంటరిగా నిలబడి ఆ సభలో తెల్లవారి వాదనలను గట్టిగా ఖండించారు. సభాధ్యక్షుడు వెంటనే కూర్చోమని గద్దించినా ఆయన కూర్చోలేదు తెల్లవాళ్లు కొడతామని బెదిరించినా ఆయన జంకలేదు సింహంలా గర్జిస్తూ టౌన్‌హాల్లో నిలబడి పోరాడిన ధీశాలి చివరికి తీర్మానమేమీ అంగీకరించకుండానే సభను ఆపి వేయవలసి వచ్చింది

ఇంకా ఎంతో మంది ఆంగ్లేయులు మసకు హృదయపూర్తిగా సహకరించారు. ఏ సమితిలోను మెంబర్లుకాక పోయినా వారంతా భారత జాతీయ సత్యాగ్రహ సంగ్రామాన్ని సమర్థించారు. యిక ముగ్గురు ఆంగ్ల మహిళలను గురించి మాత్రం వ్రాసి యీ ప్రకరణం ముగిస్తాను వారిలో ఒకరు కుమారి హాబ్‌హౌస్, ఆమె లార్డ్ హాబ్‌హౌస్‌గారి కుమార్తె బోయర్ యుద్ధ సమయంలో యీమె మహిళలార్డ్ మిల్నర్ వ్యతిరేకించినా లెక్క చేయకుండా ట్రాన్స్‌వాల్ చేరుకున్న ధైర్యవంతురాలు లార్డ్‌కిచనర్ ప్రపంచమందంతట ప్రశంసలు పొందిన లేక దూషణ పొందిన కాన్సేస్ట్రేషన్ కాంపులు. అనగా యుద్ధం చేస్తున్న బోయర్ సైనికుల భార్యలనందరినీ ప్రోగు చేసి నిర్బంధంలో వుంచుటకు క్యాంపులు, ట్రాన్స్‌వాల్ మరియు ఫ్రీస్టేట్లో తెరిచినప్పుడు యీ మహిళ ఒక్కతే ఒంటరిగా వెళ్లి బోయర్ స్త్రీల మధ్య తిరిగి వాళ్లకు ధైర్యం చెప్పడమేగాక వారిలో వీరత్వాన్ని ప్రకోపింపజేసింది. బోయర్ యుద్ధంలో ఆంగ్లేయుల విధానం తప్పని ఎలుగెత్తి చాటిన కుమారి హాబ్‌హౌస్, కీ. శే. శ్రీ స్టేడ్‌వలె ఇంగ్లీషు వాళ్లు ఓడిపోవాలని దేవుని ప్రార్థనలు జరిపింది బోయర్లకు యింత సేవ చేసిన ఆమె, యుద్ధం ఆగిపోయిన తరువాత ఆంగ్లేయుల చేతుల్లో అవమానాలు పొందిన ఆ బోయర్లు భారతీయుల్ని వ్యతిరేకిస్తున్నారని తెలిసి అమితంగా బాధపడింది. ఆమె యెడ బోయర్ ప్రజలకు అపారమైన గౌరవం వుండేది. జనరల్ బోధాతో ఆమెకు దగ్గర సంబంధం వుండేది. బోయర్లలో రక్తపు చట్టాన్ని రద్దు చేయడం అవసరమని ఆమె ప్రచారం చేసింది.