పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

195

“వస్తాను యివాళ సాయంత్రం పార్కులో కలుద్దాము "

పార్కులో కలిశాము వెస్ట్ తన భాగస్వామి దగ్గర అనుమతి తీసుకున్నారు మర్నాడు సాయంకాలం రైల్లో డర్బనుకు బయలు దేరారు. ఒక్క నెల రోజులకు ఆయన దగ్గరినుంచి రిపోర్టు వచ్చింది. "ఈ ప్రెస్సులో లాభం రాదు. నష్టం తప్పదు. ప్రెస్సు లెక్కలు సరిగా లేవు గ్రాహకులపేర్లు గాని, వారి అడ్రసులు గాని సరిగా వ్రాసుకోలేదు. ప్రెస్సు వ్యవస్థకూడా సరిగా లేదు ఆరోపణగా గాక దీన్ని మంచిగా తీసుకొండి లాభాలు గడించకపోయినా ప్రెస్సు వ్యవస్థను సరిచేస్తానని మాట యిస్తున్నాను. మీరు నిశ్చింతగా పుండండి అంగీకరించిన పనిని నేను వదలను అయితే ఒక్క విషయం, చాలా కాలం వరకు నష్టానికి మీరు సిద్ధపడవలసిందే " అని వారి రిపోర్టులో వున్నది.

మదనజిత్ "ఇండియన్ ఒపీనియన్" పత్రిక యొక్క చందాదారుల్ని గురించి ప్రెస్సును గురించి మాట్లాడుటకు జోహన్స్‌బర్గ్ వచ్చాడు. ప్రతినెలకొద్ది నష్టాన్ని నేను భరిస్తూ వుండేవాణ్ణి ఎంత డబ్బు నేను యివ్వాల్సి వుంటుందో స్పష్టంగా తెలుసుకోవాలని అనుకున్నాను మదన్ జీత్‌కు ప్రెస్సు వ్యవహరాలు తెలియవని ప్రెస్సు ప్రారంభించినప్పుడు వ్రాశాను. అందువల్ల ప్రెస్సు అనుభవం గల వ్యక్తిని అతడికి సహాయం చేయుటకు నియమించాలని భావించాను యింతలో ప్లేగు వ్యాధి విరుచుకు పడింది. ఆపద సమయంలో మదన్‌జీత్ చురుగ్గా పనిచేస్తాడని, భయపడరని తెలిసింది. అందువల్ల అతణ్ణి జోహాన్స్‌బర్గ్‌లో ఆపివేశాను ఊహించని పద్ధతిలో వెస్ట్ సాయం అందిస్తానని అనగానే నేను అంగీకరించాను. ప్లేగు సమయంలోనే గాక మిగతా రోజుల్లో కూడా మీరు డర్బన్‌లో వుండాలని వారిని కోరాను అందువల్లనే వారు అట్టి రిపోర్టు పంపించారు.

చివరికి ఇండియన్ ఒపీనియన్ పత్రికను ప్రెస్సును ఫినిక్స్ తీసుకు వెళ్లిన విషయం పాఠకులకు తెలుసు అక్కడ నెలకు 10 పౌండ్లకు బదులు 3 పౌండ్లు మాత్రమే వెస్ట్ తీసుకున్నారు. యీ మార్పులన్నింటికి వెస్ట్