పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

సహాయకులుగా వున్న తెల్లవారు


అంగీకరించారు. తన జీవితం ఎలా గడుస్తుందా అని వెస్ట్ ఎన్నడూ యోచించలేదు. ఆయన మతాన్ని గురించి చదవలేదు. అయినా గొప్ప ధార్మిక వ్యక్తిగా ఆయనను గౌరవించాను. ఆయన స్వతంత్ర ప్రవృత్తిగల మనిషి అనుకున్న విషయం చెప్పి వేసే వ్యక్తి నల్లగా వున్నదాన్ని కృష్ణవర్ణంగా వున్నదని చెప్పకుండా నల్లగా వున్నదనే చెప్పేవారన్నమాట నిరాండబరంగా జీవితం గడిపేవారు. మా యిరువురికి పరిచయం కలిగినప్పుడు ఆయన బ్రహ్మచారి తరువాత తల్లి తండ్రిని కలుసుకొనేందుకు ఆయన ఇంగ్లాండు వెళ్లారు. అక్కడ పెండ్లి చేసుకొని తిరిగి వచ్చారు. నా సలహా ప్రకారం తన భార్యను, అత్తను, పెండ్లి కాని తన సోదరినీ వెంట తీసుకు వచ్చారు వారంతా ఫినిక్స్‌లో నిరాడంబరంగా వుంటూ వుండే వారు. అన్నివిధాల భారతీయులతో కలిసి పోయారు

కుమారి ఎడా వెస్టకు (మేము ఆమెను దేవీబెన్ అని పిలిచేవారం) అప్పుడు 35 సంవత్సరాల వయస్సు ఆమె యింత వరకు వివాహం చేసుకోలేదు. పవిత్రంగా జీవితం గడుపుతున్న మహిళ ఆమె కూడా ఫినిక్స్ వాసులకు అపరిమితంగా సేవ చేసింది. ఫినిక్సులో వుంటూ వున్న బాలశిష్యుల్సి సంబాళించడం, వారికి ఇంగ్లీషు నేర్పడం, సామూహిక వంటశాలలో వంట చేయడం, ఇండ్లను శుభ్రం చేయడం. లెక్కల పుస్తకాల్లో డబ్బు లెక్కలు వ్రాయడం, ప్రెస్సులో కంపోజు చేయడం, ఆమె పని. ఏ పనైనా సరే ఆమె అందుకొని పూర్తి చేస్తూ వుండేది యిప్పుడు ఆమె ఫినిక్స్ ఆశ్రమంలో లేరు ఆమెకు ఆయ్యే మామూలు వ్యయం సైతం నేను ఇండియాకు తిరిగివచ్చిన తరువాత ఫినిక్స్ ఆశ్రమం యివ్వలేక పోయింది వెస్ట్ అత్తగారి వయస్సు 80 సంవత్సరాలు ఆమె కుట్టుపనిచక్కగా చేస్తూ వుండేది. వృద్ధురాలు అయినా కుట్టుపని విషయంలో ఆశ్రమం అంతటికీ ఆమె సహాయం చేస్తూ వుండేది ఆశ్రమవాసులంతా ఆమెను దాదీమా (తాతమ్మ) అని పిలిచేవారు శ్రీమతి వెస్ట్‌ను గురించి యిక వ్రాయనవసరం లేదు. ఆశ్రమవాసులంతా జైలుకు వెళ్లిపోయారు. అప్పుడు వెస్ట్ కుంటుంబ సభ్యులే మగన్‌లాల్