పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

సహాయకులుగా వున్న తెల్లవారు


వుండేవాణ్ణి ప్లేగు వచ్చిన రోగులకు సేవ చేస్తున్న నా వల్ల యితరులకు ఆ రోగం రావచ్చునన్న భయం కలుగవచ్చు కనుక నేను అలా వ్యవహరించాను రెండు రోజులపాటు నేను భోజనశాలలో కనబడక పోయే సరికి వెస్ట్ భయపడిపోయారు. నేను ప్లేగు వ్యాధి సోకిన రోగులకు సేవచేస్తున్నానని పత్రికలవల్ల వారికి తెలిసింది. మూడో రోజు ఉదయం 6 గంటలకు నేను ముఖం కడుక్కుంటుండగా వెస్ట్ వచ్చి నా గది తలుపు తట్టాడు. నేను తలుపు తెరిచేసరికి ఎదురుగా నవ్వు ముఖంతో నిలబడియున్న వెస్ట్ కనిపించారు

“మిమ్మల్ని చూచిన తరువాత నాకు సంతోషం కలిగింది. భోజనశాలలో మీరు కనబడనందున భయపడి పోయాను నా సాయం కావాలనుకుంటే చెప్పండి నేను సిద్ధంగా వున్నాను" అని అన్నారు. వెస్ట్ నేను వినోద స్వరంతో "మీరు రోగులకు సేవచేయగలరా? అని అడిగాను

"తప్పక చేస్తాను"

నేను అదివరకే ఒక కార్యక్రమం తయారుచేశాను మరో రకం జవాబు మీనుండి వస్తుందని నేను అనుకోలేదు. రోగులకు సేవ చేసే వాళ్లు చాలా మంది వున్నారు. అంతకంటే కఠినమైన పని మరొకటి వున్నది. మీ సాయం కావాలి మదన్‌జిత్ యిక్కడ ప్లేగు సేవా కార్యక్రమంలో లీనమైనాడు ఇండియన్ ఓపీనియస్ ప్రెస్ నడవడం లేదు మదనజీత్‌ను యిక్కడ ఆపివేశాను. కనుక మీరు డర్బన్ వెళ్లి ప్రెస్సును నడిపితే గొప్ప సహాయం చేసిన వారవుతారు. అయితే ఆ పని చేసినందుకు నేనేమీ పెద్ద మొత్తం యివ్వలేను కొద్దిగా డబ్బు అనగా నెలకు 10 పౌండ్లు మాత్రం యిస్తాను ప్రెస్సువల్ల లాభం వస్తే ఆ లాభంలో సగభాగం మీరు తీసుకోవచ్చు " అని చెప్పాను

“ఇది అంత మంచి పని కాదు. అయినా నా భాగస్వామిని అడగాలి కదా. రావలసిన బాకీలు కూడా వున్నాయి. వసూలు చేసుకోవాలి యివాళ సాయంత్రం వరకు నాకు టైము యివ్వండి తేల్చి చెబుతాను అని అన్నారు వెస్ట్