పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

193


23

సహాయకులుగా వున్న తెల్లవారు

భారతజాతీయ సంగ్రామానికి చాలా మంది ప్రసిద్ధికెక్కిన తెల్లవారు అనేక విధాల సహాయపడ్డారు. వారందరి పరిచయం చేయడం అవసరమని భావిస్తున్నాను యిందు వల్ల వారి పేరు వచ్చినప్పుడు విడిగా వారి పరిచయం చేయవలసిన అవసరం వుండదు ఒక క్రమంలో నేను వారిని పరిచయం చేస్తున్నాను పాఠకులు యీ క్రమాన్ని వారి గౌరవ ప్రతిష్ఠలకు, వారి సహాయ సహకారాల ప్రాధాన్యతకు వర్తించుకోవద్దని మనవి చేస్తున్నాను తెల్లమిత్రులు సహకరించిన సమయాన్ని బట్టి. సంగ్రామానికి సంబంధించిన వివిధ శాఖలకు వారందించిన సహాయాన్ని బట్టి పాఠకులు వారి క్రమ ప్రాధాన్యతను గ్రహించవచ్చు

వీరిలో మొట్టమొదటి వారు శ్రీ ఆల్బర్ట్ వెస్ట్ భారతీయులతో సంగ్రామానికి పూర్వం నుంచే వీరితో సంబంధం ఏర్పడింది. వ్యక్తిగతంగా అంతకు పూర్వం నుంచే వీరు నాకు పరిచయం అయ్యారు. జోహన్స్ బర్గ్‌లో నా ఆఫీసు తెరిచినప్పుడు నా కుటుంబసభ్యులు నాతో బాటు లేరు. 1903లో దక్షిణాఫ్రికా భారతీయుల నుంచి తంతి అందగానే నేను భారతదేశాన్నుంచి దక్షిణాఫ్రికాకు బయలు దేరానని పాఠకులకు తెలుసు ఒక్క సంవత్సరం తరువాత ఇండియాకు తిరిగి రావాలని అనుకున్నాను జోహన్స్‌బర్గ్‌లో ఒక శాకాహార భోజనశాల వున్నది. ఉదయం సాయంత్రం అక్కడికి నేను భోజనం చేయుటకు తప్పక వెళ్లుతూ వుండేవాణ్ణి వెస్ట్ కూడా అక్కడికి వస్తూ వుండే వారు అక్కడే మా యిద్దరికీ పరిచయం అయింది వారు మరో తెల్లవానితో కలిసి ఒక ప్రెస్సు నడుపుతూ వుండేవారు

1904లో జోహన్స్‌బర్గ్‌లో గల భారతీయుల్లో ప్లేగు వ్యాధి వ్యాపించింది. నేను రోగులకు సేవచేయుటకు పూనుకున్నాను అందువల్ల ఆ భోజనశాలకు వెళ్లడం చాలించాను. వెళ్లినా యితరులకంటే ముందే భోజనం చేసి వస్తూ