పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

ఒడంబడికకు వ్యతిరేకత


చెప్పారు. శరీరమందలి ఏ భాగానికి పెద్ద దెబ్బతగలలేదని డాక్టరు నిర్ధారణ చేశారు. ఒక వారంరోజుల్లో మంచం వదల వచ్చని, సామాన్య పనులు చేసుకోవచ్చని, రెండు మూడు మాసాల వరకు శరీరం పెద్ద పనుల బరువు భరించలేదని, అందుకు జాగ్రత్త అవసరమని చెప్పి డాక్టరు వెళ్లిపోయారు

ఇక మాట్లాడటం ఆగిపోయింది కాని చేతులు పనిచేస్తున్నాయి అధ్యక్షుని ద్వారా జాతి ప్రజలకు ఒక సందేశం వంటిది గుజరాతీలో వ్రాసి ప్రకటించమని, పంపాను అందలి వివరం యిలా వున్నది

"నా ఆరోగ్యం బాగున్నది. శ్రీ డోక్, శ్రీమతి డోక్ యిరువురూ మనస్సు నందలి ప్రేమనంతా ఒలికించి నాకు సేవ చేస్తున్నారు. కొద్దిరోజుల్లో పని ప్రారంభిస్తాను. నన్ను కొట్టిన వారి మీద నాకు కొంచెమైనా కోపం లేదు వారు తెలియక యీ పని చేశారు. వారి మీద కేసు నడపవలసిన అవసరం లేదు. అంతా శాంతంగా వుంటే యీ ఘట్టం వల్ల మనందరికి మేలు జరుగుతుంది

హిందువులు కోపం తెచ్చుకోవద్దు యీ ఘట్టం వల్ల హిందువులకు ముస్లిములకు మధ్య ఏహ్యతకు బదులు సయోధ్యత పెరగాలని కోరుతున్నాను ఖుదాసు, ఈశ్వరుణ్ణి నేను యీ మంచిపని చేయమని ప్రార్థిస్తున్నాను

నాకు దెబ్బలు తగిలిన మాట నిజం యింతకంటే ఎక్కువ దెబ్బలు తగిలినా సరే, నేను ఒక్క సలహాయివ్వాలని భావిస్తున్నాను భారతీయులందరూ పదివ్రేళ్ల ముద్రలు వేయాల్సిందే మతరీత్యా ఎవరికైనా అభ్యంతరం వుంటే ప్రభుత్వం దాన్ని తొలిగించి సౌకర్యం కల్పిస్తుంది. యిలా చేస్తేనే జాతికి, పేదలకు క్షేమం కలుగుతుంది మనం నిజమైన సత్యాగ్రహులం అయితే దెబ్బలకుగాని, భవిష్యత్తులో జరుగబోయేనమ్మక ద్రోహాలకుగాని భయపడకూడదు. పదివ్రేళ్ల ముద్రలు వేయకూడదని అనుకునే వారిని అజ్ఞానులని భావిస్తున్నాను

జాతికి మేలు చేయమని, మనల్ని సత్యమార్గాన నడపమని, హిందూ మహమ్మదీయుల హృదయాలను నారక్తపు పట్టీతో కలుపమని ప్రార్థిస్తున్నాను