పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



1

భూగోళము

ఆఫ్రికా ప్రపంచమందుగల అతి పెద్ద మహాద్వీపాల్లో ఒకటి. భారతదేశం కూడా ఒక మహాద్వీపం వంటిదే కాని ఆఫ్రికా యందలి భూభాగంలో నాలుగు లేక అయిదు భారత దేశాలు విస్తీర్ణత దృష్ట్యా పట్టే అవకాశం వున్నది. ఇది ఆఫ్రికాకు తిన్నగా దక్షిణదిక్కున నెలకొని యున్నది. భారత దేశంవలె ఆఫ్రికా కూడా ఒక ద్వీపమే. దక్షిణాఫ్రికా యొక్క అధిక భాగాన్ని సముద్రం ఆని యున్నది. ఆఫ్రికాలో ఎండవేడిమి ఎక్కువ అని అంటారు. ఒక విధంగా అది నిజమే. భూమధ్య రేఖ ఆఫ్రికా మధ్యగా వెళ్లుతుంది. ఆ రేఖకు అటునిటుగల దేశాలలో కాచే ఎండ ఎంత తీవ్రంగా వుంటుందో భారతీయులు ఊహించలేరు. భారత దేశంలో దక్షిణాదిన కొన్ని చోట్ల కాచే ఎండలు భరిస్తున్నాం కనుక ఆఫ్రికా యందు కాచే ఎండల తీవ్రతను కొద్దిగా అంచనా చేయవచ్చు. దక్షిణాఫ్రికాలో యిట్టి స్థితి లేదు. అది భూమధ్య రేఖకు దూరంగా వున్నది. అక్కడి శీతోష్ణస్థితి సమంగా ఎంతో హాయిగా వుంటుంది. ఆ దేశం ఎంతో అందంగా వుంటుంది. అందువల్ల యూరప్ దేశాల ప్రజలు అక్కడ హాయిగా నివసిస్తారు. మన భారతదేశంలో ఆ విధంగా వాళ్లు వుండలేరు.

దక్షిణాఫ్రికాలో టిబెట్, కోశ్మీరుల వంటి ఎత్తైన ప్రదేశాలు వున్నాయి కాని అవి టిబెట్ కాశ్మీరులవలె 14 లేక 15 వేల అడుగుల ఎత్తున లేవు అందువల్ల అక్కడి శీతోష్ణస్థితి సహించుటకు వీలుగా, చల్లగా హాయిగా వుంటుంది. దక్షిణాఫ్రికాయందలి కొన్ని ప్రదేశాలు క్షయ రోగులకు అత్యుత్తమమైనవని ప్రతీతి. అట్టివాటిల్లో ఒకటి దక్షిణాఫ్రికాకు చెందిన సువర్ణపురి జోహన్స్‌బర్గ్. ఏ భూభాగం మీద జోహన్స్ బర్గ్ నగరం వున్నదో, ఆ భూభాగంలో 50 ఏండ్ల క్రితం ఏమీ లేదు. గడ్డి గాదం మొలిచే ప్రదేశంగా వుండేది. అక్కడ బంగారు గనులు వున్నాయని తెలిసే సరికి పలు భవనాలు