పుట:తెలుగు వాక్యం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

తెలుగు వాక్యం

జరిగింది. కాని భిన్నపద్ధతుల్లో జరిగే సర్వనామ పరివర్తనాన్ని రెండుభాగాలు చెయ్యవచ్చు. (1) ప్రధానవాక్యంలో కర్తననుసరించి జరిగే పరివర్తన. ఇక్కడే క్రియావిభక్తి మారకుండా ఉంటుంది. (2) ప్రధానవాక్యంలో అముఖ్యకర్మ ననుసరించి జరిగే పరివర్తన. ఇక్కడ సర్వనామ పరివర్తనతోపాటు క్రియావిభక్తి కూడా మారుతుంది. కర్తననుసరించి మారేది ఉత్తమపురుష. అముఖ్యకర్మ ననుసరించి మారేది మధ్యమపురుష, వీటిని ఉత్తమపురుష సర్వనామ పరివర్తక సూత్రం మధ్యమవురుష సర్వనామ పరివర్తకసూత్రం అని రెండుసూత్రాలు చెయ్యొచ్చు. అప్పుడు సూత్రాలవరస ఇట్లా ఉంటుంది.

1. క్రియావిభక్తి సంధానసూత్రం.
2. మధ్యమపురుష సర్వనామ పరివర్తక సూత్రం.
3. క్రియావిభక్తి సంధానసూత్రం.
4. ఉత్తమపురుష సర్వనామ పరిపర్తక సూత్రం.

3.3233 : ఒకే ఉపవాక్యంలో క్రియావిభక్తి సంధానసూత్రం రెండుసార్లు వర్తించటం సాధారణంగా జరగదు. కాగా, ఒకేరకపు సర్వనామ పరివర్తనకు రెండు సూత్రాలు తయారుచెయ్యటంకూడా అంతపొదుపైన పద్ధతికాదు. అందువల్ల 2, 4 సూత్రాలను కలిపి ఒకే సర్వనామ పరివర్తక సూత్రాన్ని ఉంచటం వాంఛనీయం. సర్వనామ పరివర్తకసూత్రం సర్వభాషాసామాన్యం. క్రియావిభక్తి సంధాన సూత్రాన్ని చివర ఉంచటమే సమంజసం. అయితే ఈ సూత్రాన్ని (195) c. లో నిష్పన్నమైన వాక్యాలమీద వర్తించనియ్యకుండా నిరోధించగలిగితే ఈ సమస్యను పరిష్కరించినట్టే. “ప్రథమపురుష పరిపర్తితసర్వనామం కర్తగాఉన్న వాక్యాల్లో వర్తించరాదు" అనే ఆంక్షను క్రియావిభక్తి సంధానసూత్రానికి విధించి ఆ పని సాధించవచ్చు. ఈ రకమైన ఆంక్ష సూత్రానికి అధికభారాన్ని ఆపాదించేమాట నిజమే? అయితే ఈ ఆంక్ష ఒక్క తెలుక్కి మాత్రమే కాకమిగతాభాషలకుకూడా అవసరంకావచ్చు. సర్వభాషల్లోనూ ప్రత్యక్షానుకరణను పరోక్షానుకరణంగా పకవర్తింపజేసే విధానం ఉంది. ఆ సందర్భంలో సర్వనామ పరివర్తన భాషా సామాన్యలక్షణం. కర్తననుసరించి క్రియావిభక్తిని సంధించే పద్ధతిఉన్న భాషలన్నిట్లో ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఈ ఆంక్షభాషా సిద్ధాంతానికే అవసరం