Jump to content

పుట:తెలుగు వాక్యం.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకృతి

81

కావచ్చు. కాబట్టి ఈ ఆంక్ష భాషాసిద్ధాంతంలో భాగంగానే ప్రతిపాదించబడుతున్నది. ఇంతకన్నా మేలైన విధానం దొరికేవరకూ ఇదే మార్గం.

3.4 : (195) లో ఉదాహరించిన వాక్యాల్లో ఇద్దరుశ్రోతలు, ఇద్దరు వక్తలను మాత్రమే భావించి ఉదాహరించినవి కాని ఈ వాక్యాల్లో వక్తృశ్రోతల సంఖ్యకు పరిమితిలేదు. అనుకరణాన్ని పునఃపునరనుకరించటానికి సహజంగా వీలుంది. అనుకృతాంశ దైర్ఘ్యానికి పరిమితిలేనట్టుగానే అనుకరణవిధానానికికూడా పరిమితిలేదు. ఈ కింది బొమ్మలో ఈ పద్ధతిని గ్రహించవచ్చు.

ఇట్లా బొమ్మని ఆనంతంగా పెంచవచ్చు. ఇట్లా ఆనంతంగా అనుకరించే అవసరం వ్యవహారంలో ఉండదు. అయితే భాష అందు కనుమతిస్తుంది .

(196)

ఎల్లమ్మ ఎవరితోనో లేచి పోయిందని పుల్లమ్మ మల్లమ్మతో అన్నదని
రంగమ్మ మంగమ్మతో చెప్పిందని ఈదమ్మ పేరమ్మతో అన్నదని
అచ్చమ్మ పిచ్చమ్మతో చెప్పిందని ..... ..... .....

పై వాక్యాన్ని ఇట్లా అనంతంగా పొడిగించుకుంటూ పోవచ్చు,

3.5 : అనుకృత వాక్య భేదాల్నిబట్టి పరోక్షానుకరణలో కొన్ని మార్పులు జరుగుతై .