పుట:తెలుగు వాక్యం.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుకృతి

79

జరక్కుండా ఈఒక్క చోటే అనుకృతాంశంలోని కర్త పైవాక్యంలోకి జరిగిందనటం ఎట్లా? పైగా ప్రధానవాక్యంలోకి జరిగినట్టు భావిస్తున్న ఈ పదానికి ఆ వాక్యంలోని మిగతా పదాలకు ఎట్లాంటి సంబంధాన్ని కల్పించగలం? కాబట్టి ఈ పద్ధతికూడా దోషరహితంకాదు,

3.323 : సూత్రవర్తన క్రమంలో గతి కల్పించటం మూడో పద్ధతి. దీని ప్రకారం క్రియావిభక్తి సంధాన సూత్రం (agreement rule) మొదట వర్తింపజేసి, సర్వనామ పరివర్తక సూత్రం (pronoun change rule) తరవాత వర్తింపజేస్తే అప్పుడు క్రియ విభక్తి ఉత్తమ పురుషలోనే ఉంటానికి కారణం చూపించగలుగుతాం. అతను కు తన్వాదేశం భాషలో చాలాచోట్ల జరిగేదే కాబట్టి అక్కడ చిక్కులేదు. సూత్రాలు వాక్యంలో ఒక్కో ఉపవాక్యంలో ఒకేసారి వర్తిస్తై. క్రియా విభక్తి సంధాన సూత్రం వాక్య నిర్మాణంలో సాధారణంగా చిట్టచివర వర్తించే సూత్రం. కాని తెలుగు వాక్యాలు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నై. ముందటి రెండు పద్ధతుల కన్నా ఈ మూడోపద్ధతి మేలైనదే కాని ఇదికూడా నిష్కంటకం కాదు. కారణం కింద వివరించబడుతుంది.

3.3231 : (195) b, d లతో వాక్యాల్నిచూడండి. ప్రత్యక్షానుకరణలో అనుకృతవాక్యంలో మధ్యమపురుష సర్వనామం కర్తగాఉంది. పరోక్షానుకరణంలో అది ప్రధానవాక్యంలో అముఖ్యకర్మ ననుసరించి ప్రథమోత్తమ పురుష సర్వనామాల్లో ఒకటిగా మారింది. కాని ఈ మార్పుతోబాటు మారిన కర్తననుసరించి క్రియావిభక్తికూడా మారింది. అంటే ఇక్కడ సర్వనామ పరివర్తక సూత్రం తరవాత వర్తించింది. అంటే సూత్రాలవరస ఇక్కడ సరిగ్గా తలకిందైంది. అనుకృతాంశంలో ఉత్తమపురుష సర్వనామం ప్రధానవాక్యంలో కర్త నసుసరించి మారింది. క్రియావిభక్తి సంధానసూత్రం సర్వనామ పరివర్తకసూత్రం కంటే ముందు వర్తించింది. అనుకృతవాక్యంలో మద్యమపురుష సర్వనామంకర్తగా ఉంటే అది అముఖ్యకర్మ సనుసరించి మారింది. క్రియావిభ క్తిసంధానసూత్రం ఈసారి సర్వనామ పరిపర్తకసూత్రం తరవాత వర్తించింది. సర్వనామాల పరివర్తన విధానానికి సూత్రాల వర్తనక్రమానికి ఉన్న సంబంధం ఏమిటో అంతుచిక్కటం లేదు.

3.3232 : సర్వనామాల పరివర్తక సూత్రం ఒకటే ననుకొని పైన చర్చ