Jump to content

పుట:తెలుగు వాక్యం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

తెలుగు వాక్యం

గాని, అసలు అనుకరణాన్ని సూచించే (అని వంటి) పదమే లేని భాషల్లోగాని, పరోక్షాను కరణలో మాత్రమే వచ్చే పదం వికల్పంగా లోపించే భాషల్లోగాని (ఇంగ్లీషులో 'that' అట్లా లోపిస్తుంది.), పై రకపు భిన్నార్థకత అదే పద్ధతిలో వస్తుంది. అంటే పైన చెప్పిన సర్వనామాల మార్పులు సర్వభాషలకు సమానమేనని దీని భావం. (తన్వాదేశం అన్ని భాషల్లోనూ ఉండదు.) అంతేకాదు. దీన్నిబట్టి ప్రత్యక్ష పరోక్షానుకృతులను వేరుచెయ్యటానికి అన్నిభాషలకు వర్తించే కాలమానం సర్వనామాల మార్పు మాత్రమేనని కూడా దీన్నిబట్టి చెప్పవచ్చు.

3.32 : (195) c. వాక్యాలను పరిశీలిస్తే ఇంకో విషయాన్ని గమనించవచ్చు. ప్రత్యక్షానుకృతిలో ఉత్తమపురుష సర్వనామం కర్తగా ఉంది, తదను గుణంగా క్రియలో ఉత్తమపురుషను సూచించే క్రియావిభక్తి ఉంది. పరోక్షాను కృతిలో సర్వనామం ప్రథమ, మధ్యమ పురుషలుగా మారినా ఉత్తమ పురుష క్రియావిభక్తి ను అట్లాగే నిలచిఉంది. అంటే కర్త ప్రథమ, మధ్యమ పురుషల్లో ఉండి క్రియ ఉత్తమపురుష సూచకంగా ఉంది. ఇది వ్యాకర్తకు చికాకు కలిగించే సమస్య. దీన్ని పరిష్కరించటానికి రెండుమూడు మార్గాలు కనిపిస్తున్నై.

3.3211 : ఉత్తమ పురుషకు (నేను కు) తను శబ్దాన్ని ఆదేశంగా చెప్పటం ఒక వద్దతి. అప్పుడు నేను > అతను > తను అనే విధంగా కాక నేను > తను అనే విధంగా చెప్పాల్సి ఉంటుంది. కాని ఇది అంత సమంజసమైన పద్ధతి కాదు. భాషలో ఇంకెక్కడా నేను కు తను ఆదేశం కాలేదు. ఈ ఒక్క చోట జరిగిందనటంలో ఔచిత్యం లేదు. అదీగాక పైన పేర్కొన్న సర్వనామాల మార్పిడి అన్ని భాషల్లోనూ ఒకే రకంగా ఉంది. అంటే అన్ని భాషల్లోనూ అనుకృత వాక్యంలోని నేను శబ్దం ప్రధాన వాక్యంలో కర్త ననుసరించి మారి ఒక్క తెలుగులో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగిందనటానికి సరిఅయిన ఆధారం లేదు. తెలుగు ప్రయోగాల్ని బట్టి చూసినా, ప్రపంచ భాషల పద్ధతిని బట్టి చూసినా నేను > అతను > తను అనే మార్పే సమంజస మైనది.

3.322 : క్రియావిభక్తిని ప్రత్యక్షానుకృతిలోనే ప్రతిపాదించి, ఆ తర్వాత నేను శబ్దం అనుకృతాంశంనుంచి ప్రధాన వాక్యంలోకి జరిగిన తరవాత సర్వనామాల మార్పు జరిగిందనటం రెండో పద్ధతి. దీనికి బలం తక్కువే. ఎక్కడా