సంశ్లిష్ట వాక్యాలు
73
(190) | a. సుజాత ఊరినుంచి రేపు వస్తుందో లేదో తెలీదు. | |
పై వాక్యాల్లో (b) లో అవును శబ్దాన్ని వికల్పంగా మొదటి ప్రశ్నకు చేర్చుకుని అవునో కాదో అనవచ్చు.
2.86 : ఏం శబ్దాన్ని నిర్దేశక వాక్యాలకిచేరిస్తే 'ఎందుకు' అనే అర్థం వస్తుంది. ఉదాహరణకు నువ్వు మొన్న రాలేదేం? అంటే ఎందుకురాలేదు అని అర్థం.
ప్రశ్నార్థకమైన ఏ, ఆ శబ్దాలు ఒకే వాక్యంలో రావు.* ఆయన ఎప్పుడు వస్తాడా? అనే వాక్యం ప్రశ్నార్థకంగా తప్పు.
2.87 : ఒక ఏ- ప్రశ్నకు, అ-ప్రశ్నకు వికల్పం చెప్పటం సాధ్యం కాదు. కాని వికల్పత్వాన్ని చెప్పిన రెండు ఆ ప్రశ్నలున్నప్పుడు ఏ- ప్రశ్నతో వికల్పం సాధ్యమవుతుంది.
(191) | a. సుజాత ఎప్పుడు వస్తుందో, రాదో తెలీదు. | |
(191) (a) లో “ఎప్పుడురాదో" అనే అన్వయించుకుంటే వాక్యం వ్యాకరణసమ్మతమవుతుంది.
ఓ-శబ్దం రెండు వాక్యాల మధ్యేకాక పదాలమధ్య, పదబంధాలమధ్యగూడా వికల్పాన్ని సూచించటానికి ప్రయోగించబడుతుంది.
(192) | సుజాత ఇంజనీరునో డాక్టరునో పెళ్లిచేసుకుంటుంది. ప్రశ్నార్థకమైన | |
(193) | సుజాత ఇంజనీరునా? డాక్టరునా? పెళ్లి చేసుకుంటుంది? | |
(192), (193) వాక్యాల మధ్య కొన్ని సమానాంశాలున్నై. రెండింట్లోనూ సుజాతపెళ్ళి చేసుకుంటుంది అనే భాగం సమానం. రెంటి మధ్య వికల్పనంబంధం ఉంది. (193)తో పోలికఉన్న నిర్మాణంనుంచి (192) ను నిష్పన్నంచేయటం సాధ్యంకావచ్చు.