పుట:తెలుగు వాక్యం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

తెలుగు వాక్యం

2.724: ప్రధానవాక్యంలో గ్రహణేంద్రియ వ్యాపారబోధక (Perception verbs) క్రియలున్నప్పుడుకూడా భావార్థకనామంగా ఉపవాక్యం కర్మపదంగా వస్తుంది. అప్పుడు ప్రధాన ఉపవాక్యాలు భిన్నకర్తృకంగా ఉండాలి. చూచు, విను వంటివి ఇంద్రియ వ్యాపారబోధక క్రియలు. చూచు అనే క్రియకు దృశ్యమాన పదార్థబోధకమూ, విను అనే క్రియకు శ్రవ్యమాన పదార్థబోధక (ధ్వనియుక్త) నామం కర్మ పదాలుగా ఉండాలి.

(164)

a. రవీంద్రభారతిలో సుజాత నాట్యం చెయ్యటం చూశాను.
b. దొంగ అటువేపుగా పరిగెత్తటం చూశాను.
c. రేడియోలో సుమిత్ర పాడటం విన్నాను.
d. మా ఆవిడ వంటింట్లో గిన్నెలు పగలకొట్టటం చూశాను, (విన్నాను.)
* e. సుజాత ఆలోచించటం విన్నాను.
* f. సుజాతకు ఆకలి వెయ్యడం చూశాను.

పై వాక్యాల్లో ఆలోచించు అనే వ్యాపారం ద్రవ్యమానం, ఆకలివేయు అనే వ్యాపారం దృశ్యమానం కాకపోవటంవల్ల e, f లు వ్యాకరణ విరుద్ధాలయినై . పగలగొట్టు అనే వ్యాపారం దృశ్యమానమూ, ద్రవ్యమానమూ కావటంవల్ల (d) లో చూచు, విను అనే రెండు క్రియలూ సాధ్యమయినై. పై వాక్యాల్లో (c)కి రెండర్థా లున్నై. (1) రేడియోలో సుమిత్ర పాట విన్నాను. (2) రేడియోలో సుమిత్ర పాడిందని విన్నాను. చూచు క్రియతో ఇట్లాంటి భిన్నార్థాలుండవు. ప్రత్యక్ష వ్యాపారమే దృశ్యమానమవుతుంది. శ్రవణేంద్రియంతో వ్యాపారాన్ని ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా గ్రహించవచ్చు. విను అనే క్రియకు శ్రవణేంద్రియంద్వారా చప్పుడును గ్రహించటం అనే అర్థమేకాక ఒక విషయాన్ని భాషద్వారా ఇంకొకరు చెప్పగా గ్రహించటం అనే అర్థం కూడా ఉంది.

పై వాక్యాల్లో భావార్థక నామాలను క్రియాజన్య విశేషణాలుగామార్చి ఆ క్రియలనుబట్టి దృశ్యం, ధ్వని, విషయం అనే నామాలకు విధేయాలుగాచేసినా అర్థంలో మార్పురాదు. ఉదాహరణకు (d) లో పగలగొట్టినదృశ్యం, పగలగొట్టిన ధ్వని, పగలగొట్టిన విషయం అని మూడర్థాల్లోనూ ప్రయోగించవచ్చు.

(164) లో ఉదాహరించిన వాక్యాలు భిన్న కర్తృకాలు కావాలని చెప్ప బడింది. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అవి ఏకకర్తృకాలు కావచ్చు. ఒక సినిమా