పుట:తెలుగు వాక్యం.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

61

హీరో తను నటించిన సినిమాను తనే చూసినప్పుడు 'నేను హీరోయిన్‌తో నాట్యం చెయ్యటంచూశాను, నేను హీరోయిన్‌తో , డ్యూయట్ పాడటం విన్నాను అని అనవచ్చు. అట్లాగే కలలో జరిగిన ఘట్టాలను చెప్పేటప్పుడుకూడా ఈ రకపు వాక్యాలు వాడవచ్చును.

భావార్థకనామంలో కాలబోధకతలేదు. ప్రధానవాక్యంలో క్రియబోధించేకాలాన్నే భావార్థకనామానికి అన్వయించుకోవాలి. నువ్వురావటం ఎప్పుడు? అనే ప్రశ్నకు నువ్వు వచ్చింది ఎప్పుడు? నువ్వు వచ్చేది ఎప్పుడు? అని రెండు రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు.

2. 7251 : కొన్ని వాక్యాల్లో నామాలు ఆఖ్యాతాలుగా ప్రవర్తిస్తై.

(165)

a. నాకు కాఫీ అలవాటు.
b. నాకు నిద్ర ఇష్టం.
c. నాకు లెక్కలు కష్టం.

ఈ పై వాక్యాలలో కాఫీ, నిద్ర , లెక్కలు అనే నామాలు వ్యాపారార్థకంగా ప్రయుక్తమయినై . వాటికి కాఫీతాగటం, నిద్రపోవటం, లెక్కలు చెయ్యటం అని అర్థాలు చెప్పుకోవాలి.

2. 7252 : ఇట్లాంటి వాక్యాల్లో ఆఖ్యాతాలను రెండు రకాలుగా విభజించాలి. కొన్నిట్లో ప్రధాన వాక్యంలో అనుభోక్త, భావార్థక నామానికి కర్త ఒకటిగా ఉండాలి. కొన్నిటికి అక్కర్లేదు. ప్రధాన ఉపవాక్యాల్లో అనుభోక్త-కర్తలు ఒకటిగా లేని ఈ వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు.

*(166)

a. నాకు నువ్వు సినిమాలు చూడటం అలవాటు .
b. నాకు నువ్వు అబద్దా లాడటం మామూలు.
c. నాకు నువ్వు లెక్కలు చెయ్యటం తేలిక .
d. నాకు నువ్వు ఈ మెట్లు ఎక్కటం కష్టం.

ప్రధాన ఉపవాక్యాలుగా అనుభోక్త-కర్తలు ఒకటిగా లేకపోయినా ఈ క్రింది వాక్యాలు వ్యాకరణ సమ్మతాలు.