పుట:తెలుగు వాక్యం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

33

ఉన్న వాక్యాల్లో ప్రధాన క్రియగాని, క్త్వార్థక క్రియగాని, ఏదో ఒకటైనా దేహ మనః పరిణామ బోధకమైన క్రియ అయివుండాలని, అట్లాంటి క్రియకు అనుభోక్తగా ఉన్న నామమే ఇంకో క్రియకు అనుభోక్తగాగాని, కర్తగాగాని ఉండాలని తెలుస్తుంది. క్త్వార్థక వాక్యాలు భిన్నప్రాణి వాచకనామాలను కర్తలుగాగాని, అనుభోక్తలుగా గాని సహించవని చెప్పవచ్చు. అనుభోక్తలనుగూడా కర్తలుగా గుప్తనిర్మాణంలో ప్రతిపాదిస్తే క్త్వార్థక క్రియాసహిత వాక్యాలు ఏకకర్తృకాలుగా ఉండాలనే నియమాన్ని నిలుపుకోవచ్చు. అప్పుడు వ్యాపారాశ్రయత్వానికి విపులమైన ఆర్థం చెప్పుకోవాలి. అంటే నాకు జలుబు చేసింది అనే వాక్యంలో నేను అనే శబ్దాన్నే కర్తగా గుర్తించి కొన్ని క్రియా సందర్భాల్లో కర్తకు కు వర్ణకం వ్యక్తనిర్మాణంలో చేరుతుందని చెప్పటం ఒక పద్ధతి. క్త్వార్థక క్రియలు ఏక కర్తృకమై ఉండాలనే నియమం అప్పుడు గుప్తనిర్మాణ నియమం (deep structure constraint) అవుతుంది. అయితే అట్లాంటి నియమానికి ఇంతకు పూర్వం చర్చించిన కర్మణి వాక్యాలు విరుద్ధమవుతై. అక్కడ ఏక కర్తృక నియమం క్త్వార్థక సూత్రం వర్తించేటప్పటి నియమంగా గుర్తించాం. ఏ రకమైన వ్యాకరణ ప్రక్రియను అనుసరించినా ఎక్కడో ఒకచోట వ్యాకరణంలో అనుభోక్తృ సంబంధాన్ని గుర్తించాల్సి వస్తుంది.

పైన ప్రతిపాదించిన అనాభోక్తృ నియచూనికి విరుద్ధంగా కూడా కొన్ని వాక్యాలు కనిపిస్తున్నై.

(83)

a. సుజాత భర్తతో పోట్లాడి పుట్టింటి కెళ్ళింది.
b. సుజాత జ్వరం వచ్చి కాలేజీకి వెళ్లింది.

(83) (a) లో రెండు క్రియలకూ సుజాత కర్త. అయినా హేత్వర్థం వచ్చింది. అయితే పోట్లాడు వంటి క్రియలను పారస్పర్యార్థ బోధకాలుగా ఊహించ వచ్చు. అప్పుడు సుజాతను పోట్లాడు అనే క్రియకు కర్తగాను, అనుభోక్తగాను కూడా వ్యాఖ్యానించవచ్చు. ఉదాహరణకు ఈ కింది వాక్యంలో అనుభవబోధకత లేకపోవటంవల్ల హేత్వర్థం లేదు.

(84)

సుజాత భర్తను తిట్టి పుట్టింటికి వెళ్ళింది.

(83) (b) లో సుజాత అనుభోక్త. అయినా ఇక్కడ హేత్వర్థం లేదు.