34
తెలుగు వాక్యం
అందువల్ల అనుభోక్తృ సంబంధం ఉన్నప్పుడల్లా హేత్వర్థం వస్తుందని చెప్పలేం. ఈ వాక్యంలో (83b) హేత్వర్థానికి బదులు అప్యర్థం వస్తుంది. సుజాతకు జ్వరం వచ్చినా కూడా కాలేజి వెళ్ళింది అనే వాక్యార్థంతో (83) (b) సమానం. (83)(b)లో ప్రధాన క్రియ వ్యతిరేక క్రియ అయితే హేత్వర్థం వస్తుంది.
(85) | సుజాత జ్వరం వచ్చి కాలేజికి వెళ్ల లేదు. | |
దీన్నిబట్టి హేత్వర్థం వచ్చినప్పుడు అనుభోక్తృ సంబంధం అవసరమైనా, ఏ వ్యాపారాలకు (వ్యాపారాభావాలకుకూడా) కార్యకారణసంబంధం ఉందో వ్యవహర్తల పరిజ్ఞానాన్ని బట్టి సాంఘికమైన అలవాట్లను బట్టి మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈ వాక్యాల్ని చూడండి.
(86) | a. సుజాత భర్తతో పోట్లాడి పుట్టింటికి వెళ్లింది. | |
(86) (a)లో ఉన్న హేత్వర్థం (86) (b) లో లేక పోవటానికి కారణం ఆ భాషా సమాజంలోఉన్న సాంఘికమైన అలవాట్లు. వ్యాపారభావంకూడా హేత్వర్థంకావచ్చు. అప్పుడు క్త్వార్థక రూపానికి హేత్వర్థక వ్యతిరేక క్త్వార్థకం. ఉపయోగించబడుతుంది. ఇది ధాతువుకు అక అనే ప్రత్యయాన్ని చేర్చటంవల్ల ఏర్పడుతుంది.
(87) | సుబ్బారావు అన్నం తినక చిక్కిపోయాడు. | |
హేత్వర్థం లేనిచోట అక ప్రత్యయాంతరూపంవల్ల ఆధునికభాషలో వాక్యం వ్యాకరణ విరుద్ధమవుతుంది.
*(88) | సుబ్బారావు అన్నం తినక కాలేజికి వెళ్ళాడు. | |
తినకుండా అనే రూపం ఉపయోగిస్తే పై వాక్యం వ్యాకరణ సమ్మతమవుతుంది. ప్రాచీనభాషలో హేత్వర్థం లేనిచోట కూడా ఇట్లాంటిరూపం ఉండేదని "బ్రాహ్మణుల కవజ్ఞసేయక శమత్వంబు చేకొనుము" (అది. 67-129) అనే నన్నయ ప్రయోగంవల్ల తెలుసుకోవచ్చు. ఆధునికభాషలోకూడా కొన్నిచోట్ల హేత్వర్థం లేకుండా అక ప్రత్యయాంతరూపాలు కనిపిస్తున్నై.