పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్యగ్విద్వన్మహాసభ

గార్ధ---(రహస్యముగా) కొంకనక్క దీక్షతులూ! మీరూ తెల్లవారిందాకా అలోచించి రేపు ధనం అడ్డుపడే వుపాయం యోచించండి.

రా--దీక్షితులూ! ఇలాగురా! (రహస్యముగా) నీవు వుపాయశాలివి గనుక దహనం మానేవుపాయం యీరాత్రి నిద్రపోకుండా ఆలోచించి శవాన్ని పగలు రుద్రభూమిలో వేసినా, రాత్రికి సగం శవంనీకు అట్టేపెడతాను.

కొంక--- అలా చేతులోచెయ్యివేసి ప్రమాణం చెయ్యి. నేను తెల్లవారేటప్పటికి మూడులోకాలకు వెళ్ళినాతిరుగులేని వుపాయం ఆలోచిస్తాను.

రామ---చేతిలో చెయ్యివేసి (రహస్యముగా) మాటతప్పిపోతే, నేను మనిషికి పుట్టాలేదు. నేనన్న తరువాత మాట తిరుగుతానట్రా? ఇందులో దహనపు పెంట పెట్టినవారెవరురా?

కొంక---మరియెవరున్నారు? మేషేశ్వరుడున్ను, అశ్వపతిన్నీ, వాళ్ళతో వృషభేశ్వరుడు కూడా యేకీభవించినారు. మనయత్నం ఒకవేళ కొనసాగక పోయినా యేదో వంక పెట్టి యీ ముగ్గురినీ తప్పకుండా వెలివేయింతాము. (తనలో) ఈపక్షిముండా కొడుకును నమ్మరాదు. నేను కష్టపడి తీరావుపాయం ఆలోచిస్తూ యిన్ని మాటలూ చెప్పి నాకులేకుండా అంతా పగలు తానెకడి తెరుస్తాడేమో! అసలు వట్టుపెట్టుకొవడంలోనే వీడు మాటతప్పితేతాను మినిషికి పుట్టలేదంటూ వున్నాడు. వీడు అసలు మనిషికి పుట్టియేడిసినాడా?

రామ---(రహస్యముగా) మనప్రయత్నం తప్పిపోవడమని వకటితేచ్చిపెట్టకు. నీవుధైర్యం చెప్పకపోతే యీరాత్రి నాకు నిద్రపట్టదు.

కొంక---మనప్రయాత్నం విఫలంగాదు. కావలిసినంత నిద్రపో.

రామ--- నీకడుపుచల్లగా! అలాకవలెనుగాదూ? శవాన్ని ముట్టుకున్నందుకు వీళ్ళను వెలివెయ్యవలెనని నేను రేపు కావలసినన్ని కారికలు తీసుకువస్తాను.

వ్యాఘ్రా---అందరమూ చేరివున్నాము గనుక రేపువుదయం మళ్ళీరావడంకంటే యీరాత్రే కర్మచేయించవచ్చును.

గార్ధ---సభవారంతా వెళ్ళీపోయినారు. రేపువుదయాన్నే చేయింతాము. సఃభవారు విజయంచేస్తూవున్నారు. రేపువుదయాన్నే యెదిమ్యెక్కకుండా దయఛేసి, ఆపత్సముద్రంలో మునిగివున్న వీరిని యెలాగైనా గట్టెక్కించండి.

                 [అందరు నిష్క్రమించుచున్నారు.]